ఆ హీరోయిన్ని ఓ దర్శకుడు చీరకున్న పిన్ తీసేయమన్నాడట..

ఆ హీరోయిన్ని ఓ దర్శకుడు చీరకున్న పిన్ తీసేయమన్నాడట..

సీనియర్‌ నటి, లోక్‌సభ సభ్యురాలు హేమమాలిని తాజాగా ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను హీరోయిన్‌గా ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె గుర్తు చేసుకున్నారు. ఓ సినీ దర్శకుడి మాటల కారణంగా తాను ఎంత ఇబ్బంది పడ్డాననే విషయాన్ని హేమమాలిని వెల్లడించారు. తాను షూటింగ్‌లో ఉండగా.. అందరి ముందు ఆ దర్శకుడు అలా అనడంతో షాక్ అయ్యానని హేమామాలిని వెల్లడించారు.

ప్రస్తుతం హేమమాలిని రాజకీయాల్లో కొనసాగుతున్నారు. సినిమాలకు ఆమె దూరమై చాలా కాలమైంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో హేమమాలిని పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్, తన సినీ కెరీర్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తను నటిగా ఉన్నప్పుడు ఓ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా ఆ మూవీ దర్శకుడు తనపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకున్నారట.

హేమమాలినికి మొదటి నుంచి చీరకు పిన్ పెట్టుకునే అలవాటు ఉందట. అయితే ఓ సీన్‌లో భాగంగా దర్శకుడు తన చీర పిన్ తీసేయమన్నాడట. ఆమె షాకైందట. అయితే పిన్ తీసేస్తే చీర జారిపోతుందని చెప్పారట. తనకు కూడా కావాల్సింది అదేనని దర్శకుడు అనడంతో తాను షాక్ అయ్యానని హేమమాలిని చెప్పుకొచ్చారు. ఇక పర్సనల్ విషయానికి వస్తే.. షోలే, సీత ఔర్ గీత చిత్రాల్లో ధర్మాంద్రతో హేమమాలిని కలిసి నటించారు. ఆ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడి 1980లో వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే ధర్మేంద్రకు వివాహం అయ్యింది.

ఇవీ చదవండి:

పూజ హెగ్డే ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్..

యాడ్‌లో సితార.. షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుందట

మరో సమస్యలో నయన్ దంపతులు

రాకేష్ మాస్టర్ భార్యను నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు

స్టార్ హీరో విజయ్ తనను బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు మహిళ ఫిర్యాదు