యాడ్‌లో సితార.. షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుందట

Sithara shocking remunaration for ad

సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డ్యాన్స్ ఇరగదీస్తుంది. సితారకు సంబంధించిన ఇప్పటికే పలు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తండ్రిని ఇంటర్వ్యూ చేసి ఓ రేంజ్‌లో పాపులర్ అయిపోయింది. ఇక తాజాగా సితార ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. చిన్న వయసులో యాడ్‌లో నటించిన స్టార్ కిడ్‌గా అరుదైన ఘనత సాధించింది. జ్యువెలరీ యాడ్‌లో ఏంజిల్‌లా సితార మెరిసిపోయింది.

జ్యూవెల‍్లరీ యాడ్.. పైగా నటించింది మహేష్ బాబు కూతురు. రెమ్యూనరేషన్ మామూలుగా ఉంటుందా? సితార రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలు.. మరోవైపు యాడ్స్.. ఇంకో వైపు బిజినెస్ ద్వారా ఎంత సంపాదిస్తున్నాడనేది కూడా తెలియకుండా సంపాదించేస్తున్నాడు. ఇక మహేష్ ఫ్యామిలీ అంతా కలిసి ఓ యాడ్‌లో సందడి చేసింది. అప్పటి నుంచి సితారకు యాడ్ ఆఫర్స్ వస్తున్నాయట.

mahesh babu duaghter sithara jewellery ad

మహేష్ మాత్రం ఎన్ని యాడ్ ఆఫర్స్ వచ్చినా అంగీకరించలేదు కానీ ఒక జ్యువెలరీ యాడ్‌కు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. తాజాగా ఆ యాడ్‌కి సంబంధించిన వీడియోని న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్‌లో ప్రదర్శించారు. దీనిని స్వయంగా మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ యాడ్‌కి సితార ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్. మహేష్ కూడా తన తొలి యాడ్ కోసం ఇంత తీసుకోలేదని నెటిజన్లు చెప్పుకుంటున్నాడు.

ఇవీ చదవండి:

మరో సమస్యలో నయన్ దంపతులు

రాకేష్ మాస్టర్ భార్యను నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు

స్టార్ హీరో విజయ్ తనను బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు మహిళ ఫిర్యాదు

విడుదలకు ముందే ప్రాజెక్ట్ K మూవీకి అరుదైన గౌరవం

‘సలార్’ టీజర్.. ఫ్యాన్స్‌కి పూనకాలే.. ఆసక్తికర విషయం ఏంటంటే..

Google News