మరో సమస్యలో నయన్ దంపతులు

మరో సమస్యలో నయన్ దంపతులు

దర్శకుడు విఘ్నేష్ శివన్‌, నయనతారలపై ఆస్తి కాజేశారనే కేసు నమోదు అయ్యింది. ఈ కేసు పెట్టింది ఎవరో కాదు.. విఘ్నేష్ శివన్ సొంత బాబాయి. సరోగసి ద్వారా పిల్లలను కని.. చిక్కుల్లో పడిపోయిన నయన్ దంపతులు.. ఆ సమస్య నుంచి బయటపడ్డారు. ప్రశాంతంగా ఉన్నామనుకుంటున్న ఈ తరుణంలో విఘ్నేష్ దంపతులు సహా ఆయన తల్లి, సోదరిపై సొంత బాబాయి తన ఆస్తిని కాజేశారని ఫిర్యాదు చేశారు.  

విఘ్నేష్ శివన్‌ స్వగ్రామం.. తిరుచ్చి జిల్లా, లాల్‌కుడి గ్రామం. ఆయన తండ్రి పేరు శివకొళుదు. వీళ్లు తొమ్మిది మంది అన్నదమ్ములు. శివకొళుదు పోలీస్‌ ఇన్ఫార్మర్‌గా పనిచేసేవారు. ఆయన కొంతకాలం క్రితం మరణించారు. అయితే జీవించి ఉన్నప్పుడు శివకొళుదు తమ ఉమ్మడి ఆస్తిని అన్నదమ్ములకు తెలియకుండా ఓ వ్యక్తికి అమ్మేశారట. ఇప్పుడు తమ ఆస్తిని తమకు ఇప్పించాలంటూ శివకొళుదు సోదరులలో ఒకరైన కుంచిత పాదం పోలీసులను ఆశ్రయించారు.

మరో సమస్యలో నయన్ దంపతులు

ఈ మేరకు కుంచితపాదం, మరో సోదరుడు మాణిక్యం తిరుచ్చి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమకు తెలియకుండా మోసపూరితంగా తమ ఆస్తిని తమ సోదరుడు శివకొళుదు అమ్మేశాడని పేర్కొన్నారు. తమ ఆస్తిని కొనుగోలు చేసిన వారికి డబ్బును తిరిగి ఇచ్చేసి ఆస్తిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులో విఘ్నేష్ శివన్‌తో పాటు ఆయన భార్య నయనతార, తల్లి మీనాకుమారి, సోదరి ఐశ్వర్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

రాకేష్ మాస్టర్ భార్యను నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు

స్టార్ హీరో విజయ్ తనను బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు మహిళ ఫిర్యాదు

తుపాకీ లైసెన్స్ కావాలంటూ పుట్టపర్తి ఎస్పీని కలిసిన సీనియర్ నరేష్

విడుదలకు ముందే ప్రాజెక్ట్ K మూవీకి అరుదైన గౌరవం

సమంతకు సంబంధించిన లేటెస్ట్ వీడియో వైరల్.. ఆమె పెళ్లి వీడియో అంటూ..

Google News