రాకేష్ మాస్టర్ భార్యను నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు

రాకేష్ మాస్టర్ భార్యను నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు

ఆకస్మికంగా మరణించిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ (53) భార్యను కొందరు మహిళలు నడిరోడ్డుపై చితక్కొట్టారు. వంట చేయడానికని రాకేష్ మాస్టర్ వద్ద చేరి ఆపై భార్యను అని చెప్పుకుంటూ తిరిగిన లక్ష్మి అనే మహిళ గురించి అందరికీ తెలిసిందే. ఆమె కాస్త ఫైనాన్షియల్‌గా స్థిరపడ్డాక రాకేష్ మాస్టర్ నుంచి విడిపోయి మరో ఇంట్లోకి తన మకాం మార్చేసిందని టాక్. ఆ తరువాత రాకేష్ మాస్టర్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్‌ని సైతం లాక్కొందని ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉండగా.. నేడు లక్ష్మిని హైదరాబాద్‌లోని పంజాగుట్ట ఏరియాలో లల్లీ అనే యూట్యూబర్ మరో నలుగురు మహిళలతో ఒక్కసారిగా వచ్చి జుట్టు పట్టుకుని మరీ చితక్కొట్టారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని లక్ష్మిని స్టేషన్‌కు తరలించారు. దాడి చేసిన మహిళలపై లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ తరువాత లల్లీ సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Advertisement

లక్ష్మి తొలుత తమను దూషించిందని.. ఆధారాలు చూపించి మరీ లక్ష్మిపై లల్లీ కేసు పెట్టింది. ఇద్దరి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు వారిని విచారించి పంపించేశారు. లక్ష్మితో తమకు ఎలాంటి గొడవలూ లేవని లల్లీ తెలిపింది. అయితే తన కూతురును ఉద్దేశిస్తూ పలుమార్లు యూట్యూబ్‌లో లక్ష్మి అసహ్యకరంగా మాట్లాడుతోంది. లక్ష్మి ప్రవర్తనతో తన కూతురు మానసికంగా బాధపడుతోందని లల్లీ తెలిపింది. లక్ష్మీని కొట్టినట్టు పోలీసుల ముందు కూడా ఒప్పుకున్నట్టు వెల్లడించింది.