స్టార్ హీరో విజయ్ తనను బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు మహిళ ఫిర్యాదు

స్టార్ హీరో విజయ్ తనను బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు మహిళ ఫిర్యాదు

కోలీవుడ్ స్టార్ హీరో ఇలయదళపతి విజయ్ తనను బెదిరిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. అసలేం జరిగిందంటే.. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌- డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రానున్న చిత్రం ‘లియో’. ఇది మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఓ పాట విడుదలైంది. ‘నా రెడీ’ అనే పాట విడుదలవడం.. వివాదాల్లో చిక్కుకోవడం చకచకా జరిగిపోయాయి.

నా రెడీ పాటలో మత్తు పదార్థాల వాడకం, రౌడీయిజాన్ని ఎక్కువగా చూపించారు. దీనిపై పలువురు కోర్టుకు కూడా వెళ్లారు. అలా కోర్టుకు వెళ్లిన వారిలో ఆల్ పీపుల్స్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ ఒకరు. అయితే ఆమె బయట కూడా బీభత్సంగా విజయ్‌ను టార్గెట్ చేశారు. మీడియా సమావేశాలు పెట్టి విజయ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విజయ్‌పై ఫిర్యాదు చేశారు.

Advertisement
leo movie naa ready song

విజయ్ తన అభిమానులను సోషల్ మీడియాలో రెచ్చగొట్టి బెదిరిస్తున్నారని చెన్నై డీజీపీ కార్యాలయంలో రాజేశ్వరి ప్రియ ఫిర్యాదు చేశారు. స్వయంగా విజయ్ తనను బెదిరించడమే కాకుండా తన ఫ్యాన్స్ చేత కూడా బెదిరింపులకు గురి చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. తాను విజయ్ సినిమాలో సాంగ్‌పై ఆందోళన చేస్తున్నందుకే ఇలా చేస్తున్నారని తెలిపారు. విజయ్ సోషల్‌ మీడియా ఐడీని ట్యాగ్ చేస్తూ కొందరు తన గురించి అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని వెల్లడించారు.

ఇవీ చదవండి:

విడుదలకు ముందే ప్రాజెక్ట్ K మూవీకి అరుదైన గౌరవం

ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్‌ కల్యాణ్‌ రికార్డ్.. ఇక అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సినీ సెలబ్రిటీలెవరో తెలుసా? 

‘సలార్’ టీజర్ ఇంత ముందుగా ఎందుకు వదిలారు? కారణం ఏంటంటే..

సలార్ టీజర్ విడుదల టైంపై మీమ్సే మీమ్స్..