పూజ హెగ్డే ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్..

పూజ హెగ్డే ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్..

సినీ రంగంలో ఎప్పుడు.. ఏదైనా జరగొచ్చు. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయన్న సామెత ఇండస్ట్రీకి సరిగ్గా సరిపోతుంది. ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి దారుణంగా తయారైంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఐరన్ లెగ్ ట్యాగ్ వేయించుకుంది. ‘ఒక లైలా కోసం’ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టిన పూజ తొలినాళ్లలో ఫ్లాపులను అందుకుంది.

అమ్మడికి దువ్వాడ జగన్నాథం మాంచి హైప్ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి అమ్మడు చేసిన ప్రతి సినిమా హిట్ అవడంతో ఆమె ఉంటే చాలు సినిమా హిట్ అన్న టాక్ నడిచింది. ఇక ఈ మధ్య కాలంలో అమ్మడి అదృష్టం రివర్స్ అయిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా సినిమాలన్నీ వరుసగా ఫట్ అయ్యాయి. ఇంకేముంది? అమ్మడికి బ్యాడ్ టైమ్ మొదలైపోయింది. సినిమాలన్నీ వెనక్కిపోవడం మొదలయ్యాయి.

pooja-4

చివరకు కారణమేంటో తెలియదు కానీ.. ‘గుంటూరు కారం’ సినిమా నుంచి కూడా పూజా వైదొలిగింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదట. అమ్మడి ప్లేసులోకి శ్రీలీల ఎంటరైపోయింది. మొత్తానికి ఒక్క సినిమా కూడా లేకపోవడంతో పూజా హెగ్డే డిప్రెషన్‌కి గురువుతోందట. టైమ్ తనకు ఏమాత్రం కలిసి రావడం లేదని గ్రహించిన పూజ కొంత కాలం వరకూ సినిమాలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చేసిందట. నిజంగా ఇది ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూసే.

ఇవీ చదవండి:

మరో సమస్యలో నయన్ దంపతులు

రాకేష్ మాస్టర్ భార్యను నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు

యాడ్‌లో సితార.. షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుందట

తుపాకీ లైసెన్స్ కావాలంటూ పుట్టపర్తి ఎస్పీని కలిసిన సీనియర్ నరేష్

స్టార్ హీరో విజయ్ తనను బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు మహిళ ఫిర్యాదు

Google News