Project K: ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ వాయిదా పడనుందా?

Project K: ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ వాయిదా పడనుందా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ప్రాజెక్ట్ కె. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకుసంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండటం ఒక విశేషం. ఇక విశ్వనటుడు కమల్ హాసన్ ఈ చిత్రంలో విలన్‌గా కనిపించనుండటం మరో విశేషం.

Project K Release Date

ఈ సినిమాకు సంబంధించి ఇంకో విశేషం ఏంటంటే.. ఇండియన్ మైథాలజీని ఫ్యూచర్‌కి లింక్ చేయడం. సరికొత్త కథాంశం కావడంతో ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమాలో దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 20న చిత్ర యూనిట్ ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేయనుంది.

Project K: ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ వాయిదా పడనుందా?

అమెరికాలోని శాన్ డియాగో కామిక్-కాన్‌కు ఈ చిత్రానికి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. అక్కడే మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని కూడా లాంచ్ చేయనున్నారు. ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే అనుకున్న సమయానికి రిలీజ్ ఉండకపోవచ్చనే టాక్ నడుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. అయితే ఈ మూవీ రిలీజ్ వాయిదా పడనుందని టాక్.

ఇవీ చదవండి:

రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న విజయ్

అతనొక రేపిస్ట్‌లా ఉన్నాడు.. కాపాడాలంటూ యాంకర్ రష్మి ట్వీట్

జగన్ చూసిన పవన్ కల్యాణ్ సినిమా ఏంటో తెలుసా?

కోలీవుడ్ హీరోతో ఐశ్వర్య రజినీకాంత్ రెండో పెళ్లి?

ఆ దర్శకులు తనను బాడీ షేమింగ్ చేశారంటున్న ‘బలగం’ కావ్య

Google News