Vijay Thalapathy: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న విజయ్

Vijay Thalapathy: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న విజయ్

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్‌.. ఇప్పుడు రాజకీయ వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. అప్పట్లో అంటే జయలలిత మరణానంతరం విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని.. నెక్ట్స్ సీఎం తనే అవ్వొచ్చంటూ ఊహాగానాలు వినవచ్చాయి. కానీ విజయ్ ఏమాత్రం ఆసక్తి కనబరచలేదు. అయితే ఇటీవలి కాలంలో విజయ్ చేస్తున్న పనులు చూస్తుంటే ఈసారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అని అనిపిస్తోంది.

ఇటీవలి కాలంలో విజయ్.. తన అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చాడు. ఈ ప్రజాసంఘాల ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాడు. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి వారి తల్లిదండ్రులతో సహా విజయ్ తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు.

Vijay Thalapathy: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న విజయ్

వారందరికీ నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా ఓటు నోటు మంచిది కాదంటూ విద్యార్థుల్లో అవేర్‌నెస్ పెంచారు. ఇది కాస్త తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై టీవీ చానళ్లలో కూడా డిబేట్లు జరిగాయి.

ఇక తాజాగా విజయ్ మరోసారి తన అభిమాన సంఘ నిర్వాహకులను, కార్యకర్తలను చైన్నెలోని తన కార్యాలయంలో కలిశారు. అక్కడ ఏం మాట్లాడారు? ఏంటనే విషయాలైతే తెలియలేదు కానీ విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రచారం మాత్రం జోరందుకుంది.

ఇవీ చదవండి:

అతనొక రేపిస్ట్‌లా ఉన్నాడు.. కాపాడాలంటూ యాంకర్ రష్మి ట్వీట్

జగన్ చూసిన పవన్ కల్యాణ్ సినిమా ఏంటో తెలుసా?

కోలీవుడ్ హీరోతో ఐశ్వర్య రజినీకాంత్ రెండో పెళ్లి?

ఆ దర్శకులు తనను బాడీ షేమింగ్ చేశారంటున్న ‘బలగం’ కావ్య

ఆ హీరోయిన్ని ఓ దర్శకుడు చీరకున్న పిన్ తీసేయమన్నాడట..

Google News