జగన్ చూసిన పవన్ కల్యాణ్ సినిమా ఏంటో తెలుసా?

పబ్లిక్ టాక్ అదిరిపోవడంతో.. జగన్ చూసిన పవన్ సినిమా ఏంటో తెలుసా?

ఏపీ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. వైసీపీ వర్సెస్ జనసేన పార్టీల నడుమ ఆసక్తికర పోరు నడుస్తోంది. పవన్ వారాహి యాత్రలో భాగంగా మాట్లాడుతున్న మాట సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇప్పట్లో ఈ హీట్ చల్లారే పరిస్థితులే కనిపించడం లేదు. ఇదంతా చూస్తుంటే ఎన్నికలు వచ్చే వరకూ కూడా ఇరు పార్టీలు ఆగవేమో అనిపిస్తోంది. ఆ రేంజ్‌లో గొడవలు ముదిరిపోయాయి. 

ఇదిలా ఉండగా.. జగన్ కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏపీ గొడవల నేపథ్యంలో పవన్ గురించి జగన్ 2019 ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ కొంతమంది నెటిజెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ సమయంలో జగన్‌ను ఓ యాంకర్ పవన్ సపోర్ట్‌ని వైసీపీ కోరుతుందా? అని ప్రశ్నించారు.

Advertisement
Pawan Kalyan Tholi Prema telugu movie

దీనికి సమాధానంగా జగన్ మాట్లాడుతూ.. తానసలు వ్యక్తిగతంగా పవన్‌ను కలిసింది లేదని.. ఆయన సినిమాలు కూడా పెద్దగా చూడలేదన్నారు. అయితే అప్పట్లో పబ్లిక్ టాక్ విని.. అంతా బాగుందని చెప్పడంతో పవన్ నటించిన తొలిప్రేమ సినిమా చూశానన్నారు. తాజాగా తొలిప్రేమ సినిమా రీ రిలీజ్ అవడంతో పాటు.. వైసీపీ, జనసేన పార్టీల నడుమ నెలకొన్న పరిస్థితులతో జగన్ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవీ చదవండి:

ఆ దర్శకులు తనను బాడీ షేమింగ్ చేశారంటున్న ‘బలగం’ కావ్య

ఆ హీరోయిన్ని ఓ దర్శకుడు చీరకున్న పిన్ తీసేయమన్నాడట..

పూజ హెగ్డే ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్..

యాడ్‌లో సితార.. షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుందట

మరో సమస్యలో నయన్ దంపతులు