కోలీవుడ్ హీరోతో ఐశ్వర్య రజినీకాంత్ రెండో పెళ్లి?

కోలీవుడ్ హీరోతో ఐశ్వర్య రజినీకాంత్ రెండో పెళ్లి?

18 ఏళ్ల వైవాహిక జీవితం అంటే చిన్నదేమీ కాదు. కానీ అలాంటి వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్టు ప్రకటించి తమిళనటుడు ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ దంపతులు షాక్ ఇచ్చారు. అనంతరం వీరిద్దరూ మళ్లీ కలుస్తున్నారు.. విడిపోవడం లేదంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై ధనుష్, ఐశ్వర్యలలో ఏ ఒక్కరూ స్పందించలేదు. దీంతో రూమర్స్‌కి ఫుల్ స్టాప్ పడింది.

తాజాగా ఐశ్వర్య రజినీకాంత్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ధనుష్, ఐశ్వర్యలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి ఐశ్వర్య ఉంటున్నారు. ఆమె ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఆమెపై పుకార్లు షికారు చేయడానికి కారణం లేకపోలేదు. ఆమె తాజాగా కోలీవుడ్‌కు చెందిన ఓ హీరోతో ఐశ్వర్య కనిపించడంతో ఆమె రెండో పెళ్లి గురించిన ప్రచారం మొదలైంది.

Advertisement
Rajinikanth daughter Aishwarya

చెన్నైలోని ఓ రిసార్ట్‌లో కోలీవుడ్ హీరోతో ఐశ్వర్య సన్నిహితంగా మెలుగుతూ కనిపించారట. దీంతో ఇక ఆ హీరోను ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం ప్రారంభమైంది.

అయితే దీనిపై ఐశ్వర్య మాత్రం ఇప్పటి వరకూ స్పందించలదు. వీలైనంత త్వరగా ఆమె స్పందించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. లేదంటే అలాంటి పుకార్లతో ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఐశ్వర్య స్పందిస్తారో లేదో చూడాలి.

ఇవీ చదవండి:

ఆ దర్శకులు తనను బాడీ షేమింగ్ చేశారంటున్న ‘బలగం’ కావ్య

ఆ హీరోయిన్ని ఓ దర్శకుడు చీరకున్న పిన్ తీసేయమన్నాడట..

పూజ హెగ్డే ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్..

యాడ్‌లో సితార.. షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుందట

మరో సమస్యలో నయన్ దంపతులు