బిగ్‌బాస్ 7 తెలుగు.. సడెన్‌గా ప్రోమో రిలీజ్ చేసి షాక్ ఇచ్చిన మేకర్స్..

బిగ్‌బాస్ 7 తెలుగు.. సడెన్‌గా ప్రోమో రిలీజ్ చేసి షాక్ ఇచ్చిన మేకర్స్..

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దీనికోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటారు. వంద రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే 7వ సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ మేరకు బిగ్‌బాస్ నిర్వహికులు దీనికి సంబంధించిన ప్రోమోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

త్వరలోనే బిగ్‌బాస్‌-7 ప్రారంభం కానున్నట్టు ప్రోమో ద్వారా నిర్వాహకులు వెల్లడించారు. బిగ్‌ బాస్‌ ఆరో సీజన్‌ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు కాబట్టి ఈసారి సీజన్‌ ఉంటుందా..? అనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. అయితే బిగ్‌బాస్ టీం ప్రేక్షకులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. కనీసం ఎలాంటి అప్‌డేట్ లేకుండా ఏకంగా ప్రోమోను విడుదల చేసి షాక్ ఇచ్చింది. దీనిని చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

BB7 తెలుగుతో మళ్లీ వచ్చేస్తున్నామని ఈసారి వినోదం పూర్తి ప్యాకేజీ ఉంటుందని టీమ్‌ తెలిపింది. ఈ సీజన్‌ను 100 శాతం సక్సెస్ చేయడానికి మేకర్స్ అవసరమైన జాగ్రత్తలు చేపట్టారు. ఈ సీజన్‌లో అభిమానులకు ఎమోషన్స్‌తో పాటు సర్ప్రైజ్‌లు ఉంటాయని మేకర్స్‌ ఇప్పటికే చెప్పారు.

ఇక కంటెస్టెంట్స్ విషయంలో కూడా ఈసారి మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే  ఈ సీజన్‌లో  ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్‌ ఉండనున్నట్లు వారు చెప్పారు.

ఇవీ చదవండి:

ఆ దర్శకులు తనను బాడీ షేమింగ్ చేశారంటున్న ‘బలగం’ కావ్య

ఆ హీరోయిన్ని ఓ దర్శకుడు చీరకున్న పిన్ తీసేయమన్నాడట..

పూజ హెగ్డే ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్..

మరో సమస్యలో నయన్ దంపతులు

స్టార్ హీరో విజయ్ తనను బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు మహిళ ఫిర్యాదు

Google News