Anchor Rashmi: అతనొక రేపిస్ట్‌లా ఉన్నాడు.. కాపాడాలంటూ యాంకర్ రష్మి ట్వీట్

Anchor Rashmi: అతనొక రేపిస్ట్‌లా ఉన్నాడు.. కాపాడాలంటూ యాంకర్ రష్మి ట్వీట్

యాంకర్ రష్మీ గౌతమ్(Anchor Rashmi Gautam) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో నెటిజన్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు తన వృత్తిపరమైన, వ్యక్తిగత అప్‌డేట్స్ ఇస్తూనే ఉంటుంది. అంతేకాకుండా జీవహింసకు వ్యతిరేకంగా ఆమె సోషల్ మీడియా వేదికగానే పోస్టులు పెట్టి ఒక్కోసారి టార్గెట్ కూడా అయిపోతూ ఉంటుంది. దీనికి ఉదాహరణే.. ఇటీవల బక్రీద్ సందర్భంగా చేసిన ట్వీట్. ఆ ట్వీట్‌తో రష్మీపై పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంది.

ఇక తాజాగా రష్మి చేసిన ట్వీట్ ఆందోళన కలిగించేదిగా ఉంది. ఒక వ్యక్తి గురించి అతనో రేపిస్ట్ అని.. చిన్న పిల్లల మీద లైంగిక దాడి చేసే వాడిలా ఉన్నాడంటూ ట్వీట్ చేసింది. అసలేం జరిగిందంటే.. ఓ వీడియోలో ఒక వ్యక్తి చిన్న పెట్ డాగ్ పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. దానిని మాటల్లో చెప్పలేని విధంగా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ వీడియో చూసి చలించిపోయిన రష్మి వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ట్వీట్ చేసింది. 

వ్యక్తి పెట్ డాగ్‌ను హింసిస్తున్న ఘటన ఢిల్లో జరిగింది. దీంతో రష్మి ఢిల్లీ పోలీసులతో పాటు పెటా సంస్థను, ఎంపీ మేనకా సంజయ్ గాంధీని ట్యాగ్ చేస్తూ అతన్నుండి కుక్క పిల్లను కాపాడాలని ట్వీట్ చేసింది.

ఈ నేపథ్యంలోనే అతనిపై రష్మి పెద్ద ఎత్తున ఆరోపనలు చేసింది. అతనొక రేపిస్ట్ అయి ఉండొచ్చని.. చిన్నారులపై లైంగిక దాడి చేచసే వాడిలా ఉన్నాడని పేర్కొంది. రష్మి ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవతోంది.

ఇవీ చదవండి:

ఆ దర్శకులు తనను బాడీ షేమింగ్ చేశారంటున్న ‘బలగం’ కావ్య

బిగ్‌బాస్ 7 తెలుగు.. సడెన్‌గా ప్రోమో రిలీజ్ చేసి షాక్ ఇచ్చిన మేకర్స్..

ఆ హీరోయిన్ని ఓ దర్శకుడు చీరకున్న పిన్ తీసేయమన్నాడట..

పూజ హెగ్డే ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్..

యాడ్‌లో సితార.. షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుందట

Google News