స్టార్ హీరో విజయ్‌కు ఫైన్.. ఆయన ఏం చేశారంటే ?

స్టార్ హీరో విజయ్‌కు ఫైన్.. ఆయన ఏం చేశారంటే ?

హీరో అంటే ఎలా ఉండాలి? నలుగురికి ఆదర్శంగా ఉండాలి. అందునా మనోళ్లు హీరోలను తెగ ఫాలో అయిపోతుంటారు. అలాంటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ ఓ స్టార్ హీరో మాత్రం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడో ఏమో తెలియకుండా ఉంది. తాజాగా కోలివుడ్ స్టార్ హీరో ఇళయదళపతి చేసిన పనికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. మరి విజయ్ ఏం చేశాడో తెలుసా?

విజయ్..చెన్నైలో ట్రాఫిక్ రూల్స్‌ను పక్కనబెట్టేసి మరీ కారులో రయ్‌మంటూ దూసుకెళ్లిపోయాడు. దీనిని గుర్తించిన గ్రేటర్‌ చెన్నై ట్రాఫిక్‌ పోలీసులు ఆయనకు ఫైన్ వేశారు. ఫైన్ రూ.500 మాత్రమే. ఫైన్ ఎంతైనా సరే.. ఫ్యాన్స్‌కి ఆదర్శంగా ఉండాల్సిన ఆయన ఇలాంటి పనులు చేస్తే.. వాళ్లు ఆగుతారా? అదేదో హీరోయిజంలా ఫీలై పోయి వాళ్లు కూడా ట్రాఫిక్ రూల్స్‌ను అధిగమిస్తే వ్యవస్థ అంతా అస్థవ్యస్తమై పోతుంది. 

Advertisement
స్టార్ హీరో విజయ్‌కు ఫైన్.. ఆయన ఏం చేశారంటే ?

తాజాగా హీరో విజయ్ చెన్నై నగర శివారు ప్రాంతమైన పనైయూరులో విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కంకు చెందిన జిల్లా నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వెళుతున్న విజయ్ కారు.. అక్కరై అనే ప్రాంతంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగకుండానే ముందుకు దూసుకెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని సీసీ కెమెరాలు పట్టేశాయి. ఇక అంతే ఆయనకు ట్రాఫిక్ పోలీసులు ‘స్టాప్‌ లైన్‌ వయొలేషన్‌’ కింద రూ.500 ఫైన్ వేశారు. ఈ మొత్తాన్ని ‘జోసెఫ్‌ విజయ్‌ సి’ పేరుతో పేటీఎం ద్వారా విజయ్ చెల్లించారు.

ఇవీ చదవండి:

ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ వాయిదా పడనుందా?

రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న విజయ్

Gandheevadhari Arjuna: ప్రీ టీజ‌ర్‌లో ఈ విషయాన్ని గమనించారా ?

జగన్ చూసిన పవన్ కల్యాణ్ సినిమా ఏంటో తెలుసా?

కోలీవుడ్ హీరోతో ఐశ్వర్య రజినీకాంత్ రెండో పెళ్లి?