బన్నీ హీరో ఏంటి? మెగా ఫ్యామిలీ నుంచి వస్తే హీరోని చేసేస్తారా? అన్న అనసూయ..

బన్నీ హీరో ఏంటి? మెగా ఫ్యామిలీ నుంచి వస్తే హీరోని చేసేస్తారా? అన్న అనసూయ..

అనసూయ ఏం మాట్లాడినా వివాదమే అవుతూ ఉంటుంది. ఆమే అలా మాట్లాడుతుందో లేదంటే ఆమె యాంటీ వర్గం కావాలని యాంటీగా చూపిస్తోందో తెలియదు కానీ.. ఆమె మాత్రం ఎప్పుడూ వార్తల్లోనూ ఉంటూ వస్తోంది. ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండపై కామెంట్స్ చేసి ఆయన ఫ్యాన్స్‌కు అడ్డంగా దొరికిపోయిన అనసూయ.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి దొరికిపోయింది. 

అనసూయ అంటే చాలా మందికి పడదు. ఆమె చాలా పొగరుగా బిహేవ్ చేస్తుందని అంటుంటారు. దీంతో అమ్మడికి సోషల్ మీడియాలో శత్రువులు ఎక్కువ. అప్పుడెప్పుడో అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్‌ను ఇప్పుడు వెదికి తీసి మరీ అనసూయను ట్రోల్ చేస్తున్నారు.

Anchor Anasuya comments on Allu Arjun

ఒక ఈవెంట్‌లో అనసూయ మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ని గంగోత్రి మూవీలో చూసి షాక్ అయ్యానని తెలిపింది. అసలు మనోళ్లకు ఏమైంది? ఇలాంటి వాళ్లను హీరోను చేయడమేంటని అనుకుందట.

మెగా ఫ్యామిలీ నుంచి వస్తే మాత్రం హీరో అయిపోతాడా? అనుకున్నానని.. ఇక లంగా ఓణీ కట్టి బన్నీ చేసిన పాట అయితే దారుణమని.. అసలు చూడలేకపోయానని అనసూయ చెప్పుకొచ్చింది.

ఆ తరువాత బన్నీని పొగిడిందనుకోండి. కానీ ఆమె యాంటీ వర్గం పొగిడిన వాటిని పక్కనబెట్టి విమర్శలను మాత్రం వైరల్ చేస్తున్నారు. అది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనసూయను సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ఆ దర్శకులు తనను బాడీ షేమింగ్ చేశారంటున్న ‘బలగం’ కావ్య

కోలీవుడ్ హీరోతో ఐశ్వర్య రజినీకాంత్ రెండో పెళ్లి?

అతనొక రేపిస్ట్‌లా ఉన్నాడు.. కాపాడాలంటూ యాంకర్ రష్మి ట్వీట్

రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న విజయ్

ప్రభాస్ ప్రాజెక్ట్ కె రిలీజ్ వాయిదా పడనుందా?

Google News