Baby Review: ‘బేబి’ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతోందట.. ఓవరాల్ టాక్ ఏంటంటే..

Baby Review: ‘బేబి’ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతోందట.. ఓవరాల్ టాక్ ఏంటంటే..

ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణవి, చైత‌న్య, విరాజ్ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బేబి’. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆనంద్ దేవరకొండ ఖాతాలో హిట్ పడినట్టా.. లేదా? అనే అంశాలపై ఓ లుక్కేద్దాం. ‘క‌ల‌ర్ ఫొటో’ వంటి సినిమాకి క‌థ అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హించ‌డం.. ఒక ప్లస్.

ఇక టాక్సీవాలా’ వంటి హిట్ త‌ర్వాత ఎస్‌కేఎన్ సోలోగా నిర్మించిన సినిమా కావ‌డం.. మరో ప్లస్. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే కాస్త మంచి ఎక్స్‌పెక్టేషన్సే ఉంటాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగినట్టుగానే ఉందట ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. చిన్న నాటి నుంచి ఆనంద్ దేవరకొండ, వైష్ణవిలు ప్రేమించుకుంటూ ఉంటారు. పదో తరగతి ఫెయిల్ అవడంతో ఆనంద్ చదువు మానేసి ఆటో డ్రైవర్‌గా మారతాడు. వైష్ణవి మాత్రం కంటిన్యూ చేస్తుంది. ఆమెకు కాలేజ్‌లో విరాజ్ పరిచయమవుతాడు.

Baby Review: ‘బేబి’ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతోందట.. ఓవరాల్ టాక్ ఏంటంటే..

విరాజ్ పరిచయం తర్వాత స్టోరీ మరో మలుపు తీసుకోవడం.. ఆనంద్, వైష్ణవిల మధ్య గొడవులతో సినిమా ఆద్యంతం బాగానే సాగిందట. స్టోరీ బాగుండటంతో సినిమా యూత్‌కి బాగా నచ్చుతోందట. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు బాగున్నాయట. యూత్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందట.

ఇక సినిమా అన్నాక ఒకటో అరో మైనస్‌లు ఉండనే ఉంటాయి. క్లైమాక్స్ ఈ సినిమాకు చాలా పెద్ద మైనస్ అట. అలాగే స్టోరీ స్లోగా సాగడం కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇది మినహా సినిమా బాగుందనే టాకే వినిపిస్తోంది.

ఇవీ చదవండి:

పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన శ్రీకాంత్ కొడుకు రోష‌న్

‘అఖిల్‌తో సినిమా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు!’

బన్నీ హీరో ఏంటి? మెగా ఫ్యామిలీ నుంచి వస్తే హీరోని చేసేస్తారా? అన్న అనసూయ..

స్టార్ హీరో విజయ్‌కు ఫైన్.. ఆయన ఏం చేశారంటే ?

మహేష్ ఫ్యాన్స్‌కు అడ్డంగా దొరికిపోయిన సమంత.. ఆడేసుకుంటున్నారుగా..

Google News