విజయ్ దేవరకొండ – అనసూయల మధ్య వార్‌పై ఆనంద్ దేవరకొండ

విజయ్ దేవరకొండ - అనసూయల మధ్య వార్‌పై  ఆనంద్ దేవరకొండ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ- యాంకర్ అనసూయల మధ్య గొడవ ఈనాటిది కాదు. అర్జున్ రెడ్డి మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కొనసాగుతోంది. అయితే అనసూయపై విజయ్ దేవరకొండ ఏనాడు మాట జారింది లేదు. కనీసం తనపై అనసూయ చేస్తున్న విమర్శలపై స్పందించింది లేదు. కాబట్టి అనసూయ వార్ అంతా వన్‌ సైడ్ అనే చెప్పాలి. అయితేవిజయ్ ఫ్యాన్స్ మాత్రం అనసూయతో ఓ రేంజ్‌లో సోషల్ మీడియా వేదికగా గొడవపడ్డారు.

అర్జున్ రెడ్డి మూవీ సందర్భంగా గొడవ అనంతరం 2017లో దేవరకొండ ప్రొడక్షన్ లో అనసూయ పని చేసింది. తరుణ్ భాస్కర్, అభినవ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మీకు మాత్రమే చెప్తా చిత్రంలో అనసూయ కీలక పాత్రలో నటించింది. దీంతో విజయ్, అనసూయల మధ్య గొడవకు ఫుల్ స్టాప్ పడినట్టేనని అంతా భావించారు. కానీ లైగర్ మూవీ టైంలో మళ్లీ స్టార్ట్ అయింది. తాజాగా అనసూయ ‘బేబి’ మూవీ విడుదల సందర్భంగా ఆనంద్ దేవరకొండకు ఆల్ ది బెస్ట్ చెప్పింది.

Advertisement
విజయ్ దేవరకొండ - అనసూయల మధ్య వార్‌పై  ఆనంద్ దేవరకొండ

విజయ్‌తో వైరం అంటున్న అనసూయ.. ఆనంద్‌ను సపోర్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలోనే అన్నయ్యపై గొడవేంటని ఆనంద్‌ను ప్రశ్నించగా.. ఆ గొడవేంటో తనకు పూర్తిగా తెలియదన్నాడు. తన దృష్టిలో ఇది వన్ సైడ్ కామెంట్రీ అని తెలిపాడు. వాళ్ళిద్దరికీ ఎలాంటి గొడవలు లేవని తేల్చి చెప్పాడు. దీనికంతటికీ కారణం సోషల్ మీడియానేనని తేల్చాడు. మనకు తెలియకుండానే సోషల్ మీడియాలో భాగమై పోయామని ఆనంద్ దేవరకొండ వెల్లడించారు.

ఇవీ చదవండి:

‘బేబి’ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతోందట.. ఓవరాల్ టాక్ ఏంటంటే..

‘అఖిల్‌తో సినిమా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు!’

పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన శ్రీకాంత్ కొడుకు రోష‌న్

స్టార్ హీరోల సరసన నటించిన ఆ హీరోయిన్‌కు ఎయిడ్స్.. ఆమె విషాద కథ తెలిస్తే..

బన్నీ హీరో ఏంటి? మెగా ఫ్యామిలీ నుంచి వస్తే హీరోని చేసేస్తారా? అన్న అనసూయ..