సమంత గురించి వైరల్ అవుతున్న న్యూస్ నిజమే.. ఆమె హెయిర్ స్టైలిస్ట్ ఎమోషనల్ పోస్ట్

సమంత గురించి వైరల్ అవుతున్న న్యూస్ నిజమే.. ఆమె హెయిర్ స్టైలిస్ట్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇవ్వనుందనే వార్తలు ఇటీవలి కాలంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ వార్తలు నిజమేనని తాజాగా ఆమె హెయిర్ స్టైలిస్ట్ పెట్టిన పోస్ట్‌తో తేలిపోయింది. త్వరలో సమంత చికిత్స కోసం విదేశాలకు వెళ్లనున్నట్లు ఆమె హెయిర్‌ స్టైలిస్ట్‌ రోహిత్‌ భట్కర్‌ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.

సామ్‌తో దిగిన ఫొటోలు షేర్‌ చేసిన సమంత వైద్యం కోసం విదేశాలకు వెళ్తున్నట్లు వెల్లడించారు. రెండేళ్ల పాటు సమంతతో కలిసి పనిచేసి జీవిత కాలానికి సరిపడా జ్ఞాపకాలను పోగేసుకున్నామని వెల్లడించారు. ఎండా, వాన దేనినీ లెక్కచేయకుండా పని చేశామన్నారు. కన్నీళ్లు, సంతోషాలు, బాధలు అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించినట్టు రోహిత్ భట్కర్ తెలిపారు. ఈ రెండేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశామన్నారు. మొత్తంగా సామ్‌తో ఒక అద్భుమైన జర్నీ చేసినట్టు వెల్లడించారు.

వైద్యం తీసుకునే సమయంలో సమంతకు మరింత బలం, శక్తి ఉండాలని తాను కోరుకుంటున్నానని రోహిత్ భట్కర్ ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపారు. గతంలో కంటే రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రావాలని ఆశిస్తున్నానన్నారు. ఇప్పటి వరకూ బయటకు రాని డైమెన్షన్‌ బయటకు వచ్చి.. తద్వారా మీరు ధృడంగా ఉండాలన్నారు. అడవి మంటల్లో కూడా పెరిగే పువ్వు సమంత అని రోహిత్ పేర్కొన్నారు. మళ్లీ మిమ్మల్ని కలిసే రోజు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంటానని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ఇవీ చదవండి:

విజయ్ దేవరకొండ – అనసూయల మధ్య వార్‌పై ఆనంద్ దేవరకొండ

‘బేబి’ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతోందట.. ఓవరాల్ టాక్ ఏంటంటే..

‘అఖిల్‌తో సినిమా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు!’

పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన శ్రీకాంత్ కొడుకు రోష‌న్

స్టార్ హీరోల సరసన నటించిన ఆ హీరోయిన్‌కు ఎయిడ్స్.. ఆమె విషాద కథ తెలిస్తే..

Google News