ప్రశాంత్ నీల్, చిరు, రామ్ చరణ్.. ఇంట్రస్టింగ్ అప్‌డేట్

ప్రశాంత్ నీల్, చిరు, రామ్ చరణ్.. ఇంట్రస్టింగ్ అప్‌డేట్

ప్రశాంత్ నీల్.. పేరు ఇప్పుడు దక్షిణాదిలో మారుమోగిపోతోంది. కేజీఎఫ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు సైతం ఆయన చాలా దగ్గరయ్యారు. ఆయన సినిమా అంటే చాలు ఎక్కడలేని క్రేజ్ వస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘సలార్’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర విషయం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. 

తాజాగా ప్రశాంత్ నీల్ మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్టు టాక్. ఆ మూవీ మరెవరితోనో కాదు.. మెగాస్టార్ చిరంజీవితో. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇది మల్టీ స్టారర్ మూవీ అట. ఇక చిరంజీవితో పాటు నటించే ఆ నటుడు ఎవరనేది మరింత ఆసక్తికరంగా మారింది. తన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి ఫుల్ లెంగ్త్ రోల్ చేయాలని ఉందని.. కాబట్టి కథను సిద్ధం చేయాలని ప్రశాంత్ నీల్‌కు చిరు సూచించారట.

Chiranjeevi, Ram Charan

ఓకే అన్న ప్రశాంత్ నీల్ ఇప్పటికే మూడు కథలను చిరు, చెర్రీలకు వినిపించారట. మూడు కథలను విన్న వీరిద్దరూ ఒక దాన్ని ఓకే కూడా చేశారట. ప్రశాంత్ నీల్ మూవీ అంటేనే దాదాపు భారీ యాక్షన్ డ్రామా ఉంటుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం. నిజానికి చిరుకి ప్రశాంత్ నీల్ హార్డ్ కోర్ ఫ్యాన్. అలాంటి అభిమాని తన హీరో సినిమాను ఏ రేంజ్‌లో తెరకెక్కిస్తారో చూడాలి.

ఇవీ చదవండి:

సమంత గురించి వైరల్ అవుతున్న న్యూస్ నిజమే.. ఆమె హెయిర్ స్టైలిస్ట్ ఎమోషనల్ పోస్ట్

విజయ్ దేవరకొండ – అనసూయల మధ్య వార్‌పై ఆనంద్ దేవరకొండ

Baby Review: ‘బేబి’ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతోందట.. ఓవరాల్ టాక్ ఏంటంటే..

‘అఖిల్‌తో సినిమా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు!’

పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన శ్రీకాంత్ కొడుకు రోష‌న్

Google News