Klin Kaara: మెగా వారసురాలు క్లీంకార రూం చూస్తే షాక్ అవుతారు!
చేతినిండా డబ్బుండాలే కానీ లేనిది ఏముంటుంది చెప్పండి. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ముద్దుల కూతురు క్లీంకార కోసం చేస్తున్న ఏర్పాట్లు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బిడ్డ పుట్టడానికి ముందే తమ బిడ్డ సంరక్షణ కోసం చాలా ఏర్పాట్లు చేసేశారు. ఇక క్లీంకార ఉండే రూమ్ ఎలా ఉండాలి? అనేది కూడా ముందుగానే డిజైన్ చేశారు. ఇందుకు ప్రముఖ ఇంటీరియర్ డిజైన్ సంస్థ పని చేసింది.
ఓ ప్రముఖ సంస్థకు చెందిన పవిత్ర రాజన్ క్లీంకార గదిని డిజైన్ చేశారు. ఇక ఈ రూమ్ పచ్చదనంతో నిండిపోయేలా ప్లాన్ చేశారు. నర్సరీ పేరుతో ఈ గది రూపొందింది. ఈ రూమ్ వాల్స్ కి ఫారెస్ట్ థీమ్ ఎంచుకున్నారు. ఇక ఆ వాల్స్ అన్నీ జంతువులు, పక్షులు, చెట్లతో రూపొందాయి. వాటిని చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేవు. లేలేత రంగులతో చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. క్లీంకార కోసం సదరు నర్సరీని సిద్ధం చేసినట్టు ఉపాసన తెలిపారు.
ఈ గది రూపకల్పనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ఉపాసన షేర్ చేశారు. తమ యువరాణి క్లీంకార ఉండబోయే రూమ్ డిజైన్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. జూన్ 20న ఉపాసన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్స్ లో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. పాపకు లలితా సహస్ర నామంలోని క్లీంకార అనే పదాలతో నా మకరణం చేశారు. పాప పుట్టిన దగ్గర నుంచి ప్రతిదీ స్పెషల్‌గానే మెగా ఫ్యామిలీ చేస్తోంది.
ఇవీ చదవండి:
‘హాయ్ నాన్న’లో నాని కూతురుగా నటిస్తున్న ఈ పాప ఎవరో తెలుసా?
ప్రశాంత్ నీల్, చిరు, రామ్ చరణ్.. ఇంట్రస్టింగ్ అప్‌డేట్
సమంత గురించి వైరల్ అవుతున్న న్యూస్ నిజమే.. ఆమె హెయిర్ స్టైలిస్ట్ ఎమోషనల్ పోస్ట్
విజయ్ దేవరకొండ – అనసూయల మధ్య వార్‌పై ఆనంద్ దేవరకొండ
Baby Review: ‘బేబి’ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతోందట.. ఓవరాల్ టాక్ ఏంటంటే..