Adipurush: వామ్మో.. ఆదిపురుష్ ఇంత దారుణంగా దెబ్బతిన్నదా?

Adipurush: వామ్మో.. ఆదిపురుష్ ఇంత దారుణంగా దెబ్బతిన్నదా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి. ఈ మధ్యే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆదిపురుష్’ చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తొలి ఆట నుంచే ఈ సినిమాపై నెగిటివ్ టాక్ మొదలైంది. ఇది చాలదన్నట్టుగా బోలెడన్నీ వివాదాలు చిత్రాన్ని చుట్టుముట్టేశాయి. వెరసి సినిమా ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. సినిమా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి.

క్లోసింగ్ కలెక్షన్స్ మాత్రం ఢమాల్ అన్నాయి. బయ్యర్స్‌ని పెద్ద దెబ్బే కొట్టాయి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు వెర్షన్ కి కలిపి 190 కోట్ల రూపాయిలకు జరగింది. అది చూసి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమనుకున్నారు. అయితే క్లోజింగ్ లో కేవలం 108 కోట్ల రూపాయిల షేర్‌ను మాత్రమే రాబట్టింది. అంటే దాదాపుగా సగం నష్టాలు. వసూళ్ల సునామీ కొనసాగించే నైజాంలో ఈ సినిమా కేవలం రూ.38 కోట్లు మాత్రమే రాబట్టింది.

Adipurush telugu movie

ఫుల్ రన్‌లో ఈ చిత్రం 12 కోట్ల నష్టాలను కూడగట్టుకోవాల్సి వచ్చింది. అలాగే సీడెడ్ లో రూ.10.80 కోట్లు, ఉత్తరాంధ్ర లో 10 .70 కోట్లు , గుంటూరు లోరూ. 7 కోట్లు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ.11 కోట్ల 30 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.4.90 కోట్లు, నెల్లూరులో రూ.2.70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. మొత్తానికి ఈ సినిమా తెలుగు వర్షన్‌కి సంబంధించిన డేటా విషయానికి వస్తే.. ప్రపంచ వ్యాప్తంగా రూ.108 కోట్ల రూపాయిల వసూళ్లను సొంతం చేసుకుంది

ఇవీ చదవండి:

Anand Deverakonda: పాపం.. బేబీ.. హిట్టయినా రౌడీ తమ్ముడికి నిరాశే !

ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తున్న విశ్వక్ సేన్

Klin Kaara: మెగా వారసురాలు క్లీంకార రూం చూస్తే షాక్ అవుతారు!

Hi Nanna: ‘హాయ్ నాన్న’లో నాని కూతురుగా నటిస్తున్న ఈ పాప ఎవరో తెలుసా?

పవన్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఉస్తాద్ భగత్ సింగ్ అటకెక్కిందట..

Google News