పవన్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఉస్తాద్ భగత్ సింగ్ అటకెక్కిందట..

పవన్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఉస్తాద్ భగత్ సింగ్ అటకెక్కిందట..

ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ ఒకటి బీభత్సంగా నడుస్తోంది. నిజానికి ఇది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ఇది షాకింగ్ న్యూసే. పవన్ కళ్యాణ్-హరీష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ రద్దయిందంటూ టాలీవుడ్‌లో బీభత్సంగా న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతోంది. అంతేకాదు… దర్శకుడు హరీష్ శంకర్ హీరో రవితేజ మూవీకి కూడా షిఫ్ట్ అయ్యాడని టాక్.

పవన్ – హరీష్ కాంబో అంటేనే ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతుంటారు. ఎప్పటి నుంచో వీరి కాంబోలో మూవీ కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హరీష్ శంకర్ ఎక్కడ కనిపించినా ఆయనకు ఎదురయ్యే తొలి ప్రశ్న.. పవన్‌తో సినిమా ఎప్పుడు? అనేదే అనడంలో సందేహం లేదు. గబ్బర్ సింగ్ నిజానికి పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ అనంతరం ప్రకటించిన చిత్రాల్లో భవదీయుడు భగత్ సింగ్ ఒకటి.

Advertisement

ఎందుకోగానీ భవదీయుడు భగత్ సింగ్ కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత ఉస్తాద్ భగత్‌సింగ్ అనుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా కొంత మేర జరిగింది. కొన్ని కీలక సన్నివేశాలను సైతం చిత్రీకరించడం జరిగింది. హీరోయిన్ శ్రీలీల సైతం షూటింగ్‌లో పాల్గొంది. అంతా బాగుందనుకున్న సమయంలో సినిమా రద్దైందనే టాక్. దీనికి కారణం.. పవన్ రాజకీయాల్లో బిజీ అవడమేనని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Anand Deverakonda: పాపం.. బేబీ.. హిట్టయినా రౌడీ తమ్ముడికి నిరాశే !

3 వారాల్లో ‘సామజవరగమన’ మూవీ ఎంత రాబట్టిందో తెలిస్తే..

ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తున్న విశ్వక్ సేన్

‘బేబి’ తొలిరోజు కలెక్షన్స్‌ ఎంతో తెలుసా ?

Klin Kaara: మెగా వారసురాలు క్లీంకార రూం చూస్తే షాక్ అవుతారు!