Suriya: స్టార్ హీరో సూర్య తండ్రిపై కోపంతో అంత పని చేశాడా..!

Suriya

అవడానికి తమిళ స్టార్ హీరో అయినప్పటికీ సూర్య (Suriya)కు మాత్రం తెలుగులో కూడా మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే సూర్య గురించి కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న ఒక రూమర్ నిజమేననడానికి ఇటీవల జరిగిన ఘటన బలం చేకూర్చింది. సూర్య (Suirya) తన తండ్రి శివకుమార్‌ (Siva Kumar)తో కొంత కాలం క్రితం గొడవలు పడి సెపరేట్‌గా ఉంటున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే సూర్య అభిమానులు మాత్రం దీనిని కొట్టిపడేస్తున్నారు. అదేమీ లేదని ఇది కేవలం పుకారు మాత్రమేనని చెప్పుకొస్తున్నారు.

అయితే ఇటీవల జరిగిన ఓ ఘటన ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. సూర్య (Hero Suriya) పూర్తిగా తన మకాంను ముంబైకి మార్చేశాడు. ముంటైలో ఇటీవలే రూ.70 కోట్లను వెచ్చించి ఒక లగ్జరీ హౌస్‌ని కొనుగోలు చేశాడట. ఆ తరువాత భార్యాపిల్లలతో పూర్తిగా తన మకాంను ముంబైకి మార్చేశాడట. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి కాబట్టి అక్కడికి మకాం మార్చాడనుకున్నా కూడా పూర్తిగా తమిళ ఇండస్ట్రీని వదిలేసి అయితే వెళ్లడు కదా. చెన్నైలోనే ఏదో ఒక ప్రాంతంలో తీసుకుని ఉండొచ్చు. శాశ్వతంగా చెన్నై వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Suriya with his father Siva Kumar

నిజానికి సూర్య(Suriya) ఏడాది కాలంగా ముంబైలోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. చెన్నై(Chennai)లోని అన్ని షూటింగ్స్‌కి అక్కడి నుంచే వచ్చి వెళుతున్నాడని టాక్ నడుస్తోంది. ఇక ఇప్పుడు అయితే శాశ్వతంగా ముంబైకి మకాం మార్చాడు కాబట్టి ఇక ముందు కూడా ముంబై నుంచే షూటింగ్స్‌లో పాల్గొంటాడు. అయితే చెన్నైలో ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడుంటాయా? అనేదే పెద్ద క్వశ్చన్. అభిమానులైతే (Suriya Fans) మాత్రం ఉమ్మడి కుటుంబంలో కలతలు వద్దని.. సూర్య(Suriya) కుటుంబం మళ్లీ కలవాలని కోరుకుంటున్నారు.

Google News