‘జ‌వాన్’ న‌య‌న‌తార‌ పోస్ట‌ర్ విడుద‌ల‌.. మునుపెప్పుడూ చూడ‌ని లుక్ లో

Nayanthara poster from 'Jawan' released

ప్రేక్ష‌కుల్లో రోజురోజుకీ ఘ‌నంగా అంచ‌నాలు క్రియేట్ చేస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జ‌వాన్‌. షారుఖ్‌ఖాన్ హీరోగా న‌టిస్తున్నారు. నానాటికీ జ‌నాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది జ‌వాన్ మూవీ. జ‌వాన్ నుంచి నెక్స్ట్ ఎలాంటి అప్‌డేట్ వ‌స్తుందా? అని ఆత్రుత‌తో ఎదురుచూస్తున్న అభిమానుల మ‌న‌సు తెలుసుకున్న మేక‌ర్స్ కొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. చూడ‌గానే స్ట‌న్నింగ్‌గా, యాక్ష‌న్ ప్యాక్డ్ అవ‌తార్‌లో మెప్పిస్తున్నారు న‌య‌న‌తార‌.

జ‌వాన్ హీరోయిన్ న‌య‌న‌తార లుక్‌కి అంద‌రూ ఫిదా అవుతున్నారు. ప్రివ్యూలో ఆమె లుక్ చూసిన వాళ్లు సినిమాలో మ‌రో రేంజ్‌లో ఉండి తీరుతుంద‌ని ఫిక్స్ అయ్యారు. ఈ పోస్ట‌ర్ వారి అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా డిజైన్ అయింది. షారుఖ్ ఇచ్చిన ట్రీట్ సూప‌ర్‌డూప‌ర్ అంటున్నారు ఫ్యాన్స్.

సౌత్ ఇండియాలో త‌లైవిగా, లేడీ సూప‌ర్‌స్టార్‌గా మెప్పించిన న‌య‌న‌తార‌కు బాలీవుడ్‌లో ఇది తొలి సినిమా. ప్ర‌ప్ర‌థ‌మంగా ఆమె ఉత్త‌రాదిన చేస్తున్న సినిమా కోసం అక్క‌డివారు కూడా ఎదురుచూస్తున్నారు. మొట్ట‌మొద‌టి సారి వెండితెర‌మీద క‌లిసి న‌టిస్తున్నారు షారుఖ్ ఖాన్‌, న‌య‌న‌తార‌. వారిద్ద‌రి మ‌ధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని చూడ‌టానికి వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు మూవీగోయ‌ర్స్.

Nayantara Poster From Jawan

జ‌వాన్ ప్రివ్యూలో న‌య‌న‌తార‌ను చూసిన వారు వావ్ అంటున్నారు. హై ఆక్టేన్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ఆమె పాత్ర డిజైన్ అయిన తీరుకు ఫిదా అవుతున్నారు. పోస్ట‌ర్‌ని చూస్తుంటే నెక్స్ట్ లెవ‌ల్ మూవీ రెడీ అవుతోంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. న‌య‌న‌తార ఈ మూవీలో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తారు. ఆమె కేర‌క్ట‌ర్ సినిమాలో అత్య‌ద్భుతంగా హైలైట్ అవుతుంద‌నే విష‌యంలో అస‌లు అనుమానాలేం అక్క‌ర్లేదు. ఇలాంటి ఇంట్ర‌స్టింగ్ విష‌యాల‌ను వెల్ల‌డిస్తూ ఆడియ‌న్స్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నారు మేక‌ర్స్. నెక్స్ట్ అప్‌డేట్ ఏం ఇస్తారా? అంటూ ప్రేక్ష‌కులు వెయిట్ చేసేలా క్యూరియాసిటీ స్ట్రాంగ్‌గా క్రియేట్ అయింది.   

రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రూపొందిస్తున్న సినిమా జ‌వాన్‌. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గౌరీఖాన్ నిర్మాత‌. గౌర‌వ్‌వ‌ర్మ స‌హ నిర్మాత‌. జ‌వాన్ మూవీని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు. హిందీ, తెలుగు, త‌మిళ్‌లో విడుద‌ల కానుంది జ‌వాన్‌.

ఇవీ చదవండి:

పవన్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఉస్తాద్ భగత్ సింగ్ అటకెక్కిందట..

స్టార్ హీరో సినిమా విషయమై నోరు జారిన హీరోయిన్.. ఫ్యాన్స్ ఫైర్

వామ్మో.. ఆదిపురుష్ ఇంత దారుణంగా దెబ్బతిన్నదా?

పాపం.. బేబీ.. హిట్టయినా రౌడీ తమ్ముడికి నిరాశే !

3 వారాల్లో ‘సామజవరగమన’ మూవీ ఎంత రాబట్టిందో తెలిస్తే..

Google News