హీరో రాజశేఖర్ దంపతులకు ఏడాది పాటు జైలు శిక్ష
హీరో రాజశేఖర్ ఆయన సతీమణి జీవితలకు జైలు శిక్ష పడిన ఘటన టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. మెగాస్టార్ చిరంజీవిపై చేసిన ఆరోపణలపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రాజశేఖర్, జీవితలకు జడ్జి శిక్ష విధించారు. అయితే ఈ కేసు ఈనాటిది కాదు. 2011కు సంబంధించింది. అప్పట్లో రాజశేఖర్, జీవిత చిరంజీవి మీద తీవ్ర ఆరోపణలు చేశారు.
సమాజ సేవ ముసుగులో చిరంజీవి వ్యాపారం చేస్తున్నారని.. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకులో జరిగేవన్నీ అక్రమాలేనంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అభిమానుల నుంచి రక్తం సేకరించి ప్రైవేటు వ్యక్తులకు ఆసుపత్రులకు అమ్ముకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఏ ఒక్క పేదవాడికి చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు నుంచి ఉచితంగా రక్తం రాదంటూ ఆరోపణలు చేశారు. దీనిపై అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. వారిద్దరిపై పరువు నష్టం దావా వేశారు.
అప్పటి నుంచి ఈ కేసు విచారణ కోర్టులో సాగుతూనే ఉంది. తాజాగా తీర్పు వెలువడింది. రాజశేఖర్ దంపతులకు రూ.5 జరిమానాతో పాటు చెరొక ఏడాది జైలు శిక్షను విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించింది. అయితే అపరాధ రుసుము చెల్లించడంతో జిల్లా కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఇచ్చారు. మరి దీనిపై పై కోర్టును ఆశ్రయిస్తారో లేదంటే శిక్షను అనుభవించేందుకు సంసిద్ధులవుతారో చూడాలి.
ఇవీ చదవండి:
వామ్మో.. సురేఖావాణి కూతురేంటి బీచ్‌లో ఇంతలా రెచ్చిపోయింది
వామ్మో.. ఆదిపురుష్ ఇంత దారుణంగా దెబ్బతిన్నదా?
స్టార్ హీరో సినిమా విషయమై నోరు జారిన హీరోయిన్.. ఫ్యాన్స్ ఫైర్