Project K First look: ‘ప్రాజెక్ట్ కె’ ఫస్ట్‌లుక్ పోస్టర్.. ఎవడురా ఫోటోషాప్ చేసిందంటూ.. నెటిజెన్ల ఫైర్

‘ప్రాజెక్ట్ కె’ ఫస్ట్‌లుక్ పోస్టర్.. ఎవడురా ఫోటోషాప్ చేసిందంటూ..

డార్లింగ్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ‘ప్రాజెక్ట్ K’ ఒకటి. ఇటీవలి కాలంలో ప్రభాస్ వరుసగా ఫ్లాపులు మూటగట్టుకుంటున్నాడు. దీంతో ఆశలన్నీ ఆయన ప్రాజెక్ట్ కె పైనే పెట్టుకున్నాడు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్టర్ కాబట్టి సినిమా తప్పక హిట్ అవుతుందని భావిస్తున్నారు.

ప్రభాస్ లాంటి కటౌట్‌ని పెట్టుకుని నాగ్ అశ్విన్ అయితే సింపుల్‌గా సరిపెట్టడు కదా. బుధవారం ప్రాజెక్ట్ కె నుంచి ఫస్ట్‌లుక్ విడుదలైంది. రోబో తరహాలో ప్రభాస్ సూట్ ధరించి ఉన్నాడు. పొడవైన జుట్టుతో ఒక టార్జాన్ మాదిరిగా కనిపించాడు. తన చేతితో భూమిని గుద్దితే అది బద్దలైనట్టుగా ఫస్ట్‌లుక్ డిజైన్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఫిదా అవుతున్నారు. 

ఫస్ట్ లుక్ మార్ఫింగ్ చేసినట్టుగా ఉందని కొందరు ట్విటర్ వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. సేమ్ పోస్టర్ ఒకదానిని తీసి.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ‘ఎవడురా జస్ట్ హెడ్ ఫోటో షాప్ చేసింది’. ‘ఆదిపురుష్ వీఎఫ్ఎక్స్ వాళ్లు అనుకుంటా’ అని ఒకరు రిప్లై ఇస్తున్నారు. మొత్తానికి ఫస్ట్ లుక్‌కు మిశ్రమ స్పందన వస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

https://twitter.com/VC_Creations/status/1681620804298244098
Google News