ట్యాక్సీ డ్రైవర్‌గా మారిన ‘ప్రేమదేశం’ అబ్బాస్

Hero Abbas

ప్రేమ దేశం చిత్రం టాలీవుడ్‌లో ఒక సెన్సేషన్. ఈ చిత్రం సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని అన్ని వర్గాల ప్రేక్షకులూ ఆదరించారు. ఈ మూవీతో అబ్బాస్, వినీత్ ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయమయ్యారు. వినీత్ అప్పటికే ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఈ చిత్రం అతని కెరీర్‌కి మాంచి హైప్ ఇచ్చింది. టబు హీరోయిన్. మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ ఏదో మ్యాజిక్ చేశారు. దీంతో ఈ చిత్రంలోని సాంగ్ ఎవర్‌గ్రీన్. 

ఇంతకీ ఇప్పుడు ప్రేమదేశం చిత్రం గురించి ఎందుకు అంటారా? అబ్బాస్ గురించి చెప్పడానికి. ఈ సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా అబ్బాస్ తయారయ్యాడు. ఈ చిత్రంతో అబ్బాస్ స్టార్స్ పక్కన కూర్చొంటాడు అనుకున్నారంతా. ఎంత త్వరగా పేరు తెచ్చుకున్నాడో అంతే త్వరగా ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఆ తరువాత సెకండ్ హీరో, సపోర్టింగ్ రోల్స్ చేసినా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 

అబ్బాస్ 2015 తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. ఒక యాడ్‌లో మాత్రం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాడు. ఇక ప్రస్తుతం అబ్బాస్ న్యూజిలాండ్‌లో ఉంటున్నాడు. తాజాగా ఇండియాలో అడుగుపెట్టిన అబ్బాస్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టెన్త్ ఫెయిల్ కావడంతో సూసైడ్ చేసుకోవాలనుకున్నాడట. అదెలాగో మిస్ అయిపోయింది. ఇక ఇప్పుడు నటనపై బోర్ కొట్టి న్యూజిలాండ్ వెళ్లి బైక్ మెకానిక్‌గానూ, ట్యాక్సీ డ్రైవర్‌గానే మారానని అబ్బాస్ చెప్పాడు.

ఇవీ చదవండి:

‘ప్రాజెక్ట్ కె’ ఫస్ట్‌లుక్ పోస్టర్.. ఎవడురా ఫోటోషాప్ చేసిందంటూ.. నెటిజెన్ల ఫైర్

హీరో రాజశేఖర్ దంపతులకు ఏడాది పాటు జైలు శిక్ష

బిగ్‌బాస్ సీజన్ -7 లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది..

వామ్మో.. సురేఖావాణి కూతురేంటి బీచ్‌లో ఇంతలా రెచ్చిపోయింది

‘జ‌వాన్’ న‌య‌న‌తార‌ పోస్ట‌ర్ విడుద‌ల‌.. మునుపెప్పుడూ చూడ‌ని లుక్ లో

స్టార్ హీరో సినిమా విషయమై నోరు జారిన హీరోయిన్.. ఫ్యాన్స్ ఫైర్

Google News