డ్యామేజ్ కంట్రోల్‌కు ప్రాజెక్ట్ కె టీం యత్నం.. మార్పులతో మరో పోస్టర్ విడుదల

డ్యామేజ్ కంట్రోల్‌కు ప్రాజెక్ట్ కె టీం యత్నం.. మార్పులతో మరో పోస్టర్ విడుదల

ఇటీవలి కాలంలో ప్రభాస్‌కు ఎందుకోగానీ టైం పెద్దగా కలిసి రావడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ తన ఆశలన్నీ ప్రాజెక్ట్ కె పైనే పెట్టుకున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక ప్రాజెక్ట్ కె నుంచి అప్‌డేట్ వస్తుందనగానే ఎగిరి గంతేశారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది నాగ్ అశ్విన్ కూడా కావడం గమనార్హం. అయితే ప్రాజెక్ట్ కె నుంచి నిన్న వచ్చిన అప్‌డేట్ ఫ్యాన్స్‌ని తీవ్ర నిరాశకు గురి చేసింది.

నిన్న ప్రాజెక్ట్ కె నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనికి కారణం.. ఆ పోస్టర్ మార్ఫింగ్‌లా అనిపించడమే. దీంతో ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ డబుల్ డిజాస్టర్. అసలు ఏమాత్రం అంచనాలు అందుకోలేదు. నిజానికి దీనికంటే ఫ్యాన్ మేడ్ పోస్టరే అద్భుతంగా అనిపించింది. దీంతో నెట్టింట ఓ రేంజ్‌లో ట్రోల్స్ వచ్చాయి. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా ప్రాజెక్ట్ కే టీమ్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. 

డ్యామేజ్ కంట్రోల్‌కు ప్రాజెక్ట్ కె టీం యత్నం.. మార్పులతో మరో పోస్టర్ విడుదల

ఈ పోస్టర్‌కు కొంచెం మార్పులు చేర్పులు చేసి చిత్ర యూనిట్ మరో పోస్టర్‌ను విడుదల చేసింది. లుక్‌లో అయితే మార్పేమీ లేదు కానీ బ్యాక్ గ్రౌండ్ మాత్రం మార్చారు. ఏదిఏమైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అయితే ఫస్ట్ ఇంప్రెషనే దారుణంగా దెబ్బకొట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. ఇక మరికొన్ని గంటల్లో టీజర్ విడుదల కానుంది. ఇది బాగుంటే ఇబ్బంది లేదు. అటు ఇటు అయ్యిందో సినిమా అస్సామేనని నెటిజన్లు అంటున్నారు.

ఇవీ చదవండి:

ట్యాక్సీ డ్రైవర్‌గా మారిన ‘ప్రేమదేశం’ అబ్బాస్

పూజా హెగ్డే ఆత్మహత్యకు యత్నించిందా? అసలు నిజమేంటి?

‘ప్రాజెక్ట్ కె’ ఫస్ట్‌లుక్ పోస్టర్.. ఎవడురా ఫోటోషాప్ చేసిందంటూ.. నెటిజెన్ల ఫైర్

హీరో రాజశేఖర్ దంపతులకు ఏడాది పాటు జైలు శిక్ష

బిగ్‌బాస్ సీజన్ -7 లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది..

Google News