Kalki 2898 AD: ప్రాజెక్ట్ కె.. ఒక్క టీజర్‌తో రఫ్పాడించారు

Kalki 2898 AD: ప్రాజెక్ట్ కె.. ఒక్క టీజర్‌తో రఫ్పాడించారు..

ప్రాజెక్ట్ కె.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశాక జనాల్లో వచ్చిన టాక్.. ‘ఈ సినిమా కూడా పాయే.. ప్రభాస్ ఖాతాలో మరో ఫ్లాప్ పడిపోయినట్టే.. ’ అని వచ్చింది. కానీ నేటి తెల్లవారుజామున చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. ఏమన్న ఉందా? హాలీవుడ్ రేంజ్ మేకింగ్.. మొత్తానికి నాగ్ అశ్విన్ రఫ్ఫాడించారు. సాంకేతికత, నిర్మాణ విలువలు సినిమాపై అంచనాలను అమాంతం ఆకాశానికి మోసుకెళ్లాయి.

Kalki 2898 AD: ప్రాజెక్ట్ కె.. ఒక్క టీజర్‌తో రఫ్పాడించారు..

ఇక ప్రభాస్ లుక్ ఔట్ స్టాండింగ్. ఇక ప్రాజెక్ట్ కె.. టైటిల్‌ను కూడా చిత్ర యూనిట్ ప్రకటించేసింది. ‘కల్కి 2898 AD’ అంటూ టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తించారు నాగ్ అశ్విన్. ఒక్క టీజర్‌తోనే చాలా అంశాలను చెప్పేశారు. మొత్తానికి కథపై ఓ క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఈ కథ 2898 ADలో మొదలవుతుంది. అంటే ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగిన కథ. మానవజాతి సమస్తం దుష్టుల చేతిలో పడి నలుగుతున్నప్పుడు కల్కి రంగంలోకి దిగుతాడు.

Kalki 2898 AD: ప్రాజెక్ట్ కె.. ఒక్క టీజర్‌తో రఫ్పాడించారు..

ఆ తర్వాత కథ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరం. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కేవలం ఈ సినిమాను నాగ్ అశ్విన్ పిరియాడిక్ స్టోరీతోనే నడపరట. భవిష్యత్‌ను కూడా కలిపి కథ నడిపిస్తారని తెలుస్తోంది. భవిష్యత్తులో కూడా ప్రభాస్ శత్రువులతో యుద్ధం చేస్తాడు. ఇక ఈ టీజర్‌లో హీరోయిన్ దీపికా పదుకొణెని చాలా మోడ్రరన్ లుక్‌లో చూపించారు. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మొత్తానికి సినిమాపై భారీ అంచనాలు స్టార్ట్.

ఇవీ చదవండి:

ట్యాక్సీ డ్రైవర్‌గా మారిన ‘ప్రేమదేశం’ అబ్బాస్

పూజా హెగ్డే ఆత్మహత్యకు యత్నించిందా? అసలు నిజమేంటి?

‘ప్రాజెక్ట్ కె’ ఫస్ట్‌లుక్ పోస్టర్.. ఎవడురా ఫోటోషాప్ చేసిందంటూ.. నెటిజెన్ల ఫైర్

హీరో రాజశేఖర్ దంపతులకు ఏడాది పాటు జైలు శిక్ష

బిగ్‌బాస్ సీజన్ -7 లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది..

Google News