Sreemukhi: ఒక్కరోజైనా ఆ స్టార్ హీరోతో డేట్ కు వెళతానంటున్న శ్రీముఖి

Sreemukhi: ఒక్కరోజైనా ఆ స్టార్ హీరోతో డేట్ వెళతానంటున్న శ్రీముఖి

స్టార్ యాంకర్ శ్రీముఖి పెళ్లిపై తరచుగా వార్తలు వస్తూనే ఉంటాయి. అలాగే ఆమెపై రూమర్స్‌ కూడా తక్కువేమీ కాదు. తనపై వచ్చిన పుకార్లను శ్రీముఖి ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంటారు. ఆమెపై డేటింగ్ వార్తలేమీ తక్కువ కాదు. కానీ శ్రీముఖి స్వయంగా ఫలానా వ్యక్తితో డేటింగ్ చేయాలని ఉందని చెప్పింది లేదు. అయితే శ్రీముఖి ఒక హీరో మీద మనసు పారేసుకుందట. ఆయనతో తన పెళ్లికి ముందు ఒక్కరోజైనా డేటింగ్‌కి వెళ్లాలని ఉందని చెప్పింది.

రియల్ కపుల్‌కి సంబంధించిన ఓ షోలో శ్రీముఖిని కమెడియన్ ఫైమా ఒక ప్రశ్న అడిగింది. ఇప్పుడు ఈ ప్రశ్న.. శ్రీముఖ సమాధానం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నీకు పెళ్లి వద్దా? అని ఫైమా అడిగ్గా.. మనకు ఏ హీరో సెట్ అవుతాడని శ్రీముఖి తిరిగి ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ఫైమా.. ప్రభాస్ ఒక్కడే బ్యాచ్‌లర్‌గా ఉన్నాడని తెలిపింది. దీనికి వెంటనే శ్రీముఖి.. ప్రభాస్ అయితే పెళ్లి కి ముందే ఒక రోజు డేట్‌కి వెళతానని ఓపెన్ అయిపోయింది. 

Sreemukhi: ఒక్కరోజైనా ఆ స్టార్ హీరోతో డేట్ వెళతానంటున్న శ్రీముఖి

ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని శ్రీముఖి ఇప్పటికే ఓ సందర్భంలో బయటపెట్టింది. పెళ్లి ఎప్పుడు? అనేది మాత్రం శ్రీముఖి చెప్పదు. పోనీ వయసేమైనా తక్కువా? అంటే మూడు పదులు దాటేశాయ్. పెళ్లికి ఇంకా టైం ఉందని.. కుదిరినప్పుడు చెబుతానని అంటుంది. పెళ్లిపై ఏ న్యూస్ పడితే ఆ న్యూస్ రాయవద్దంటూ క్లాస్ పీకుతుంది. బిగ్‌బాస్ తర్వాత శ్రీముఖి కెరీర్ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతోంది. మరోవైపు వెండితెరపై కూడా ప్రస్తుతం అవకాశాలను బాగానే రాబట్టుకుంటోంది.

ఇవీ చదవండి:

పుష్ప 2 డైలాగ్‌ను లీక్ చేసిన బన్నీ

Kalki 2898 AD: ప్రాజెక్ట్ కె.. ఒక్క టీజర్‌తో రఫ్పాడించారు

ట్యాక్సీ డ్రైవర్‌గా మారిన ‘ప్రేమదేశం’ అబ్బాస్

పూజా హెగ్డే ఆత్మహత్యకు యత్నించిందా? అసలు నిజమేంటి?

వామ్మో.. సురేఖావాణి కూతురేంటి బీచ్‌లో ఇంతలా రెచ్చిపోయింది

Google News