కల్కి 2989.. ఆ నాలుగు పాత్రలే కీలకం.. ఆయన పాత్రపై సస్పెన్స్

కల్కి 2989.. ఆ నాలుగు పాత్రలే కీలకం.. ఆయన పాత్రపై సస్పెన్స్..

ప్రాజెక్ట్ కె చిత్రానికి సంబంధించిన టైటిల్ కూడా రివీల్ అయిపోయింది. చిత్రానికి కల్కి అనే టైటిల్ పెట్టింది చిత్ర యూనిట్. టైటిల్‌ను ప్రకటించినప్పటికీ ప్రాజెక్ట్ కె అనేది కథలో భాగమని.. కథలో దీని ప్రస్తావన ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి టీజర్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్ సంబరాల్లో ముంచేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ చూసి నిరుత్సాహానికి గురైన ఫ్యాన్స్.. టీజర్‌ను చూసి ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు.

కల్కి టీజర్ చూశాక సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. అయితే టీజర్ తర్వాత కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా టీజర్‌లో నాలుగు పాత్రలను పరిచయం చేశారు. ఒక పాత్రను మాత్రం సస్పెన్స్‌లో ఉంచారు. కల్కిగా ప్రభాస్ ని చూపించిన తీరు హైలైట్‌గా నిలుస్తోంది. ఇక ఒక కీలక నటుడిని పరిచయం చేసి ప్రేక్షకులకు నాగ్ అశ్విన్ షాక్ ఇచ్చారు. 

కల్కి 2989.. ఆ నాలుగు పాత్రలే కీలకం.. ఆయన పాత్రపై సస్పెన్స్..

ఈ చిత్ర టీజర్‌తో అమితాబ్ పాత్ర ఆసక్తి రేపింది. అనూహ్యంగా తమిళ నటుడు పశుపతి తెరపైకి వచ్చాడు. ఆయన ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇక అమితాబ్ పాత్ర మరో హైలైట్. అమితాబ్ పాత్రకు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇక కమల్ హాసన్ పాత్రపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తానికి కల్కి మూవీ రెండు భాగాలుగా విడుదల కానుందని సమాచారం. పార్ట్ 1 లో కంటే పార్ట్ 2లో కమల్ హాసన్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని సమాచారం.

ఇవీ చదవండి:

పుష్ప 2 డైలాగ్‌ను లీక్ చేసిన బన్నీ

ఒక్కరోజైనా ఆ స్టార్ హీరోతో డేట్ కు వెళతానంటున్న శ్రీముఖి

ప్రాజెక్ట్ కె.. ఒక్క టీజర్‌తో రఫ్పాడించారు

పూజా హెగ్డే ఆత్మహత్యకు యత్నించిందా? అసలు నిజమేంటి?

హీరో రాజశేఖర్ దంపతులకు ఏడాది పాటు జైలు శిక్ష

Google News