వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి డేట్ ఫిక్స్.. ఇక పెళ్లి ఎక్కడంటే?

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి డేట్ ఫిక్స్.. ఇక పెళ్లి ఎక్కడంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది. ఇటీవలే మెగా ఫ్యామిలీ మధ్య వైభవంగా నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోంది. మెగా డాటర్ నిహారిక విడాకుల వ్యవహారంలో కాస్త డిస్టర్బ్ అయిన మెగా ఫ్యామిలీ.. క్లీంకార ఇంట్లోకి అడుగు పెట్టడంతో చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు హ్యాపీనెస్‌కి వరుణ్ తేజ్ పెళ్లి మరింత హ్యాపీనెస్ ఇవ్వనుంది. 

అయితే ఎందుకోగానీ మెగా ఫ్యామిలీ.. వరుణ్, లావణ్యల నిశ్చితార్థాన్ని ఎంతో వైభవంగా జరిపించేసి సైలెంట్ అయిపోయింది. నాగబాబు సైతం వారిద్దరి పెల్లి విషయమై మాట్లాడింది లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ వీరిద్దరి పెళ్లి ఎప్పుడా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి వారిద్దరి పెళ్లి తేదీ ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం ఆగస్ట్ 24వ తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది.

Varun Tej Lavanya Tripathi

ఇక నెక్ట్స్ పెళ్లి ఎక్కడో తెలుసా? డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఇటలీలో జరగబోతుందట. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీలతో పాటు దగ్గరి బంధువులు, ఇరువురి స్నేహితులకు మాత్రమే ఆహ్వానం ఉంటుందని సమాచారం. ఇక వరుణ్ తేజ్ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన నటించిన ‘గాంఢీవధారి అర్జున’ చిత్రం ఆగస్ట్ 25న విడుదల కాబోతున్నట్లు సమాచారం. అంటే వరుణ్ పెళ్లైన తెల్లవారే. ఇక ఈ సినిమా హిట్ అయితే మాత్రం వరుణ్‌కి మ్యారేజ్ గిఫ్ట్ గట్టిగానే అందినట్టవుతుంది.

ఇవీ చదవండి:

కల్కి 2989.. ఆ నాలుగు పాత్రలే కీలకం.. ఆయన పాత్రపై సస్పెన్స్

ఒక్కరోజైనా ఆ స్టార్ హీరోతో డేట్ కు వెళతానంటున్న శ్రీముఖి

పుష్ప 2 డైలాగ్‌ను లీక్ చేసిన బన్నీ

ట్యాక్సీ డ్రైవర్‌గా మారిన ‘ప్రేమదేశం’ అబ్బాస్

పూజా హెగ్డే ఆత్మహత్యకు యత్నించిందా? అసలు నిజమేంటి?

హీరో రాజశేఖర్ దంపతులకు ఏడాది పాటు జైలు శిక్ష

Google News