సితార.. తండ్రి మహేష్ ను మించిపోయిందిగా..!

సితార.. తండ్రి మహేష్ ను మించిపోయిందిగా..!

మహేష్ బాబు గారాల పట్టి సితార.. ఇటీవలి కాలంలో తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటోంది. యాడ్స్‌లో నటిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక ఈ యాడ్‌లో భారీ పారితోషికాన్ని తీసుకున్న సితార దానిని ఓ ఛారిటీకి రాసివ్వడం ఆసక్తికరంగా మారింది. తద్వారా నటనలోనే కాకుండా దానగుణంలో కూడా సితార తండ్రిని మించిపోతోంది. యాడ్ ద్వారా వచ్చిన పారితోషికాన్ని చారిటీకి రాసివ్వడంపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

ఇక తాజాగా సితార మరోసారి గొప్ప మనసు చాటుకుంది. తన పుట్టిన రోజును పేద పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకుని మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకూ సితార బయటకు వచ్చి ఇలా చేసింది. నిజానికి గతంలో పేదలతో కలిసి చాలా మంది సెలబ్రిటీలు పుట్టిన రోజులు జరుపుకున్నారు. అయితే సితార మాత్రం సమ్‌థింగ్ స్పెషల్. తన బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పేద పిల్లలందరికీ గిఫ్ట్‌లు ఇచ్చి సితార ఆకట్టుకుంది.

సితార.. తండ్రి మహేష్ ను మించిపోయిందిగా..!

జూలై 20న సితార పుట్టిన రోజు. ఈసారి తన పుట్టినరోజు వేడుకను సితార మహేష్ బాబు ఫౌండేషన్ లో జరుపుకుంది. అక్కడికి చాలా మంది నిరుపేద ఆడపిల్లలు వచ్చారు. వారి సమక్షంలోనే సితార కేక్ కట్ చేసింది. అనంతరం వారందరికీ పింక్ కలర్ లేడీస్ సైకిళ్లను బహుమతిగా ఇచ్చింది. అమ్మాయిలంతా ఫుల్ ఖుషీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సితార మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇవీ చదవండి:

కల్కి.. టీజర్ అదుర్స్.. కానీ రాజమౌళి ఏంటి అలాంటి ప్రశ్న వేశారు?

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి డేట్ ఫిక్స్.. ఇక పెళ్లి ఎక్కడంటే?

కల్కి 2989.. ఆ నాలుగు పాత్రలే కీలకం.. ఆయన పాత్రపై సస్పెన్స్

ఒక్కరోజైనా ఆ స్టార్ హీరోతో డేట్ కు వెళతానంటున్న శ్రీముఖి

పుష్ప 2 డైలాగ్‌ను లీక్ చేసిన బన్నీ

Google News