టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

టాలీవుడ్‌లో కమెడియన్స్‌కి కొదువేం లేదు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. స్టార్ హీరోలు సైతం చేయనన్ని సినిమాలు కొందరు కమెడియన్స్ చేశారు. వీరిలో మూడు షిఫ్ట్‌లూ పని చేసే కమెడియన్స్ ఉన్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం, అలీ వంటి నటులైతే వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. మరి ఒక స్టార్ హీరో రేంజ్ ఉన్న కమెడియన్స్ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. 

ఒక్కొక్కరూ కాల్‌షీట్‌కు ఎంత తీసుకుంటున్నారంటే.. తొలుత బ్రహ్మానందం. ఆయన ఇండస్ట్రీని శాసించారు. అలాంటి బ్రహ్మీ.. కాల్‌షీట్‌కి రూ. 5-7 లక్షలు తీసుకున్నారట. ఇక సునీల్ ప్రస్తుతమైతే విలన్‌గా నటిస్తున్నారు కానీ అప్పట్లో కమెడియన్‌గా ఆయన హవా అంతా ఇంతా కాదు. సునీల్ రూ.4 లక్షలు తీసుకుంటున్నారు. ఇక ఆయన తరువాత అలీ. వెయ్యి చిత్రాలకు పైగా నటించిన అలీ కాల్షీట్‌కు రూ.3.5 లక్షలు తీసుకుంటున్నారని టాక్.

టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

ఇక వెన్నెల కిషోర్. ప్రస్తుతం ఆయన స్టార్ కమెడియన్‌గా అవతరించారని అనుకుంటున్నారు. ఆయన రెమ్యూనరేషన్ రూ. 2-3 లక్షలని టాక్. ఇక సప్తగిరి.. ఓ రేంజ్‌లో ఎగిసిన కమెడియన్. ఇప్పుడు కాస్త ఆయన హవా తగ్గింది. అయినా కూడా సప్తగిరి రూ.2 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇక కమెడియన్ శ్రీనివాసరెడ్డి, 30 ఇయర్స్ పృథ్వి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు కాల్షీట్‌కు రూ.2 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.

ఇవీ చదవండి:

సితార.. తండ్రి మహేష్ ను మించిపోయిందిగా..!

కల్కి.. టీజర్ అదుర్స్.. కానీ రాజమౌళి ఏంటి అలాంటి ప్రశ్న వేశారు?

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి డేట్ ఫిక్స్.. ఇక పెళ్లి ఎక్కడంటే?

ఒక్కరోజైనా ఆ స్టార్ హీరోతో డేట్ కు వెళతానంటున్న శ్రీముఖి

పుష్ప 2 డైలాగ్‌ను లీక్ చేసిన బన్నీ

కల్కి 2989.. ఆ నాలుగు పాత్రలే కీలకం.. ఆయన పాత్రపై సస్పెన్స్

Google News