Ram Charan: రామ్ చరణ్ – బుచ్చిబాబు మూవీ ఆసక్తికర న్యూస్ వైరల్

Buchi Babu: రామ్ చరణ్ - బుచ్చిబాబు మూవీ ఆసక్తికర న్యూస్ వైరల్

ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ ప్లానింగే మారిపోయింది. గతంలో మాదిరిగా కాకుండా సినిమాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ సెట్స్‌పై ఉండగానే.. మరో సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాకు ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో RC 16గా ఈ సినిమా రూపొందనుంది.

తన రెండో సినిమానే మెగా పవర్ స్టార్‌తో చేయడం నిజంగానే ఒక వరంలా బుచ్చిబాబు ఫీలవుతున్నారట. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం భారీ ప్లానింగ్‌తో ఆయన ఉన్నారట. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఉప్పెన మూవీ మాదిరిగానే ఈ సినిమాను కూడా బుచ్చిబాబు కోనసీమ నేపథ్యంలో ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే కథ కూడా సిద్ధమైపోయిందని సమాచారం.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఆర్సీ 16ను బుచ్చి బాబు పాన్ ఇండియా మూవీగా తీయబోతున్నారట. గేమ్ చేంజర్ మూవీ కూడా పాన్ ఇండియా మూవీగానే రూపొందుతోంది. ఇక ఆర్సీ 16 కూడా పాన్ ఇండియా అయితే వరుసగా మూడు చేసి చెర్రీ హ్యాట్రిక్ కొట్టేస్తాడు. ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను వందల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు సమాచారం. మరి ఈ సినిమాను బుచ్చిబాబు సక్సెస్ చేయగలుగుతారో లేదో చూడాలి.

ఇవీ చదవండి:

కల్కి.. టీజర్ అదుర్స్.. కానీ రాజమౌళి ఏంటి అలాంటి ప్రశ్న వేశారు?

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి డేట్ ఫిక్స్.. ఇక పెళ్లి ఎక్కడంటే?

కల్కి 2989.. ఆ నాలుగు పాత్రలే కీలకం.. ఆయన పాత్రపై సస్పెన్స్

పుష్ప 2 డైలాగ్‌ను లీక్ చేసిన బన్నీ

ప్రాజెక్ట్ కె.. ఒక్క టీజర్‌తో రఫ్పాడించారు

ట్యాక్సీ డ్రైవర్‌గా మారిన ‘ప్రేమదేశం’ అబ్బాస్

Google News