Indian 2: ‘ఇండియన్ 2’ నుంచి ఆసక్తికర అప్‌డేట్.. వైరల్ అవుతున్న శంకర్ పోస్ట్

Indian 2: ‘ఇండియన్ 2’ నుంచి ఆసక్తికర అప్‌డేట్.. వైరల్ అవుతున్న శంకర్ పోస్ట్

కోలీవుడ్ దర్శకుడు శంకర్ మూవీస్ అంటే ఎంత గ్రాండ్‌‌గా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. టెక్నాలజీని వినియోగించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. తన ఆలోచనలకు టెక్నాలజీ జోడించి, ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుంటారు. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం శంకర్ ‘ఇండియన్‌ 2’ కోసం ఆయన మరో అడుగు ముందుకేశారు. 

Director Shankar

ఇండియన్ మూవీకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులంతా ఈగర్‌గా వెయిట్ చేశారు. వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ… శంకర్-కమల్ హాసన్ లు ఇండియన్ 2ని గ్రాండ్ గా అనౌన్స్ చేసారు. ఈ సినిమా కోసం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వినియోస్తున్నట్టు శంకర్ తెలిపారు. ఈ చిత్రానికి ప్రముఖ సంస్థ లోలా వీఎఫ్‌ఎక్స్‌ అందిస్తుండటం విశేషం. ఈ విషయాన్ని శంకర్ స్వయంగా అనౌన్స్ చేశారు. ఆ స్టూడియోలో దిగిన పిక్‌ను సైతం షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ న్యూస్‌తో పాటు.. శంకర్ ఫోటో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఇండియన్‌ 2’ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంబోతోదంటూ సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. ఈ సంస్థ చాలా హాలీవుడ్ చిత్రాలకు వీఎఫ్ఎక్స్ అందించింది. అవన్నీ మంచి హిట్ అయ్యాయి. ఇక ఇండియన్ 2 విషయానికి వస్తే.. ఈ సినిమా పలు కారణాలతో మధ్యలో చాలా కాలం ఆగిపోయింది. తిరిగి గత ఏడాది సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇవీ చదవండి:

రామ్ చరణ్ – బుచ్చిబాబు మూవీ ఆసక్తికర న్యూస్ వైరల్

టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

సితార.. తండ్రి మహేష్ ను మించిపోయిందిగా..!

కల్కి.. టీజర్ అదుర్స్.. కానీ రాజమౌళి ఏంటి అలాంటి ప్రశ్న వేశారు?

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి డేట్ ఫిక్స్.. ఇక పెళ్లి ఎక్కడంటే?

కల్కి 2989.. ఆ నాలుగు పాత్రలే కీలకం.. ఆయన పాత్రపై సస్పెన్స్

Google News