RRR in Japan: జపాన్‌లో ‘అవతార్‌’ని మించబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్లు!

జపాన్‌లో ‘అవతార్‌’ని మించబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్లు..!

గత ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రం ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. వసూళ్ల సునామీతో  దూసుకెళ్లింది. అంచనాలకు ఏమాత్రం తీసిపోకపోవడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ రేంజ్‌లో ఈ చిత్రానికి గుర్తింపు వచ్చింది. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడంతో సినిమా రేంజ్ ఆకాశాన్నంటింది. ఇక ఈ సినిమాను గత ఏడాది జపాన్‌లో సైతం చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

ఇక ఆ సమయంలో చిత్ర యూనిట్ మొత్తం జపాన్‌కి వెళ్లి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించింది. బీభత్సంగా ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రపంచాన్ని ఆకర్షించారు. ఫలితంగా ఈ చిత్రానికి ఓ రేంజ్‌లో హైప్ వచ్చింది. దీంతో బీభత్సమైన వసూళ్లు సాధిస్తోంది. అక్కడి బాక్సాఫీస్‌ని సైతం గడగడలాడిస్తోంది. ఈ చిత్రం దేశం కాని దేశంలో ఈ స్థాయి విజయం సాధించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందునా ఇన్ని రోజుల పాటు ఆడటం కూడా మరింత ఆసక్తికరంగా మారింది.

RRR in Japan: జపాన్‌లో ‘అవతార్‌’ని మించబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్లు..!

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ నెల 28 వ తారీఖున ఈ చిత్రాన్ని జపాన్ లో డబ్బింగ్ చేసి విడుదల చెయ్యబోతున్నారు. అంటే ఇప్పటి వరకూ ఆడింది తెలుగు వర్షన్ సినిమా.ఇక పోతే జపాన్ లో జేమ్స్ కామెరూన్ ‘అవతార్ 2’ చిత్రం 4.2 బిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.

ఈ వసూళ్లను మించిపోయి మరీ ఆర్ఆర్ఆర్ చిత్రం వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఇక ఇప్పుడు విడుదల కాబోయే జపాన్ వర్షన్‌తో అవతార్ 2 రికార్డ్‌ని ఈ సినిమా బ్రేక్ చెయ్యడం ఖాయమని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Indian 2: ‘ఇండియన్ 2’ నుంచి ఆసక్తికర అప్‌డేట్.. వైరల్ అవుతున్న శంకర్ పోస్ట్

రామ్ చరణ్ – బుచ్చిబాబు మూవీ ఆసక్తికర న్యూస్ వైరల్

టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..

సితార.. తండ్రి మహేష్ ను మించిపోయిందిగా..!

కల్కి.. టీజర్ అదుర్స్.. కానీ రాజమౌళి ఏంటి అలాంటి ప్రశ్న వేశారు?

వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి డేట్ ఫిక్స్.. ఇక పెళ్లి ఎక్కడంటే?

కల్కి 2989.. ఆ నాలుగు పాత్రలే కీలకం.. ఆయన పాత్రపై సస్పెన్స్

Google News