అమ్మకు బాగోలేదని.. ఆ డబ్బుతో కారు కొన్నావా? ముక్కు అవినాష్‌పై నెటిజన్లు ఫైర్

అమ్మకు బాగోలేదని.. ఆ డబ్బుతో కారు కొన్నావా? ముక్కు అవినాష్‌పై నెటిజన్లు ఫైర్

జబర్దస్త్‌ షోతో కమెడియన్‌గా మారి.. ఆపై బిగ్‌బాస్ షో ద్వారా తెగ ఫేమస్ అయిపోయాడు ముక్కు అవినాశ్. అంతకు ముందు అవినాష్ కమెడియన్‌గా తెలుసు కానీ మరీ అంత ఫేమస్ అయితే కాదు. కానీ బిగ్‌బాస్‌లో ఆయన చేసిన కామెడీ ఓ రేంజ్‌లో పేలింది. ఇక ఆ తరువాత ఇటీవలి కాలంలో పలు షోల ద్వారా జనాన్ని బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. మొత్తానికి అ త్వరలోనే తండ్రి కాబోతున్న అవినాశ్.. తాజాగా నెటిజన్లకు టార్గెట్ అయ్యాడు. 

ఓపక్క తండ్రి కాబోతున్నాడని సంతోషించే లోపే అతడి తల్లి మల్లమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిపాలైంది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్‌లో ఓ వీడియో ద్వారా బయటి ప్రపంచానికి తెలిపాడు. ఇటీవలే మల్లమ్మకు గుండెలో స్టంట్స్‌ పడ్డాయి. ఆమె హాస్పిటల్‌లో స్ట్రెచర్‌పై ఉండటం.. అవినాష్ ఆమెకు ధైర్యం చెబుతూ సేవలు అందించడం వంటివి తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా అవినాష్ కారు కొని దానికి సంబంధించిన వీడియోను సైతం యూట్యూబ్‌లో పోస్ట్ చేశఆడు.

పాత కారుకు యాక్సిడెంట్ అయి డ్యామేజ్ అవడంతో కొత్త కారు కొన్నానని తెలిపాడు. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారుతో భార్యాభర్తలిద్దరూ ఫోటోలు, వీడియోలకు ఫోజులిచ్చారు. దీని ధర దాదాపు రూ.25 లక్షల మేర ఉంటుందని తెలుస్తోంది.

అమ్మకు బాగోలేదని.. ఆ డబ్బుతో కారు కొన్నావా? ముక్కు అవినాష్‌పై నెటిజన్లు ఫైర్

అంతా బాగానే ఉంది కానీ తల్లికి గుండెపోటు వచ్చిందని చెప్పి నాలుగు రోజులు కూడా కాకముందే కొత్తకారు కొనడం అవసరమా? అని కొందరు.. అమ్మకు ఆరోగ్యం బాగోలేదని తీసిన వీడియో ద్వారా వచ్చిన డబ్బుతో కారు కొన్నావా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇవీ చదవండి:

‘గుంటూరు కారం’ సినిమా నుంచి తమన్ ఔట్?

హాలీవుడ్‌ను తలపించే స్టంట్స్‌తో ‘గాండీవధారి అర్జున’ టీజర్‌

జపాన్‌లో ‘అవతార్‌’ని మించబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్లు!

‘ఇండియన్ 2’ నుంచి ఆసక్తికర అప్‌డేట్.. వైరల్ అవుతున్న శంకర్ పోస్ట్

రామ్ చరణ్ – బుచ్చిబాబు మూవీ ఆసక్తికర న్యూస్ వైరల్

టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలిస్తే..