బిగ్‌బాస్ తెలుగుకి కంటెస్టెంట్స్ కరువు!

బిగ్‌బాస్ తెలుగుకి కంటెస్టెంట్స్ కరువు..

అన్ని భాషల్లోనూ దుమ్ము రేపుతున్న రియాలిటీ షో బిగ్‌బాస్. తెలుగులో ఏడో సీజన్ త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా వచ్చేశాయి. ఈ సీజన్‌కు సైతం హోస్ట్‌గా నాగార్జునే చేస్తున్నారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ విషయంలో రోజుకో న్యూస్ వినిపిస్తోంది. ఈ షోకి కేవలం ముగ్గురు, నలుగురు మినహా ఇంకా కంటెస్టెంట్స్ ఫైనల్ కాలేదట.

ఆసక్తికర విషయం ఏంటంటే.. గతంలో బిగ్‌బాస్ అవకాశం కోసం సెలబ్రిటీలు తెగ ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. బిగ్‌బాస్ అంటేనే పారిపోతున్నారట. బిగ్‌బాస్‌కు వెళ్లి ఉన్న విలువ పోవడం తప్ప ఇంకేమి లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సెలబ్రిటీస్‌ను బిగ్‌బాస్‌కు రప్పించడం అనేది ముందుగా నిర్వాహకులకు అతిపెద్ద టాస్క్‌గా మారిందట. గత సీజన్‌ ఫెయిల్యూర్‌కి చాలా కారణాలున్నాయి.

వాటిలో మెయిన్ రీజన్ వచ్చేసి సరైన సెలబ్రిటీలంటూ ఎవరూ లేకపోవడం. ఆ తర్వాత ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అయితే తొలి సీజన్ అంత సక్సెస్ కావడానికి కారణం ముఖ్యంగా సెలబ్రిటీలే. కాబట్టి ఈ సారి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలను రంగంలోకి దింపాలని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. టీవీ నటుడు ప్రభాకర్, మై విలేజ్ షో అనిల్, డాన్స్ మాస్టర్ ఆట సందీప్ అతని వైఫ్ మాత్రమే ఇప్పటిదాకా అగ్రిమెంట్‌పై సైన్ చేశారట. మిగిలిన వారెవరూ కూడా ఫైనల్ కాలేదట.

ఇవీ చదవండి:

అమ్మకు బాగోలేదని.. ఆ డబ్బుతో కారు కొన్నావా? ముక్కు అవినాష్‌పై నెటిజన్లు ఫైర్

‘గుంటూరు కారం’ సినిమా నుంచి తమన్ ఔట్?

హాలీవుడ్‌ను తలపించే స్టంట్స్‌తో ‘గాండీవధారి అర్జున’ టీజర్‌

జపాన్‌లో ‘అవతార్‌’ని మించబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్లు!

‘ఇండియన్ 2’ నుంచి ఆసక్తికర అప్‌డేట్.. వైరల్ అవుతున్న శంకర్ పోస్ట్

రామ్ చరణ్ – బుచ్చిబాబు మూవీ ఆసక్తికర న్యూస్ వైరల్

Google News