అమెరికాలోని ఓ మ్యూజిక్ షోలో స్పెషల్ అట్రాక్షన్‌గా అనసూయ

అమెరికాలోని ఓ మ్యూజిక్ షోలో స్పెషల్ అట్రాక్షన్‌గా అనసూయ

ప్రముఖ యాంకర్, నటి అనసూయ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. వెకేషన్ కోసమని యూఎస్ వెళ్లిన అనసూయ అక్కడ కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది. తాజాగా అనసూయ అక్కడ ఓ మ్యూజిక్ షోలో సందడి చేసిందట. అసలే ఇండియాలో ఉంటేనే అమ్మడిని నిండుగా బట్టల్లో చూడటం కష్టం. ఇక అమెరికాలో ఎలాంటి డ్రెస్‌లో దర్శనమిచ్చిందో తెలుసా?

మంచి వైట్ కలర్ డ్రెస్‌పై ఆకట్టుకునే డాట్స్‌ ఉన్న డ్రెస్‌ను ధరించింది. మొత్తానికి మరీ అంత హాట్‌గా అయితే లేదు కానీ చూడగానే ఆకట్టుకునేలా మాత్రం ఉంది. మొత్తానికి అనసూయ అద్భుతంగా రెడీ అయిపోయి వెళ్లి మ్యూజిక్ షోలో అనసూయ సందడి చేసింది. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దానికి సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అవతున్నాయి. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

అమెరికాలోని ఓ మ్యూజిక్ షోలో స్పెషల్ అట్రాక్షన్‌గా అనసూయ

ప్రస్తుతానికి యాంకరింగ్‌కు బ్రేక్ ఇచ్చి నటిగా ఫుల్ బిజీ అయిపోయింది అనసూయ. సినిమా సంగతి ఏమో కానీ ఆమె పాత్రకైతే కావల్సినంత రెస్పాన్స్ అయితే వస్తోంది. ఇప్పటికే విమానం మూవీలో వేశ్య పాత్రలో జీవించిన అనసూయ.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ఇక పుష్ప 2లో ఒక డీ గ్లామర్ రోల్‌లో నటిస్తోంది. ఇక శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందనున్న పెదకాపు మూవీలోనూ అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది.

ఇవీ చదవండి:

అమ్మకు బాగోలేదని.. ఆ డబ్బుతో కారు కొన్నావా? ముక్కు అవినాష్‌పై నెటిజన్లు ఫైర్

‘గుంటూరు కారం’ సినిమా నుంచి తమన్ ఔట్?

హాలీవుడ్‌ను తలపించే స్టంట్స్‌తో ‘గాండీవధారి అర్జున’ టీజర్‌

బిగ్‌బాస్ తెలుగుకి కంటెస్టెంట్స్ కరువు!

జపాన్‌లో ‘అవతార్‌’ని మించబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్లు!

‘ఇండియన్ 2’ నుంచి ఆసక్తికర అప్‌డేట్.. వైరల్ అవుతున్న శంకర్ పోస్ట్

Google News