అల్లు అర్జున్.. ఇండియాలో ఆ ఘనతను సాధించిన తొలి హీరో!

అల్లు అర్జున్.. ఇండియాలో ఆ ఘనతను సాధించిన తొలి హీరో!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆల్ ఇండియా వైడ్‌గా ఆయనకు అభిమాన గణం ఉంది. ఇంతటి అభిమాన గణాన్ని సంపాదించుకోవడం అనేది వేరే ఏ హోరోకి సాధ్యం కాలేదనే చెప్పాలి. ఇక సోషల్ మీడియాలోనూ బన్నీ హవా కొనసాగుతోంది. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఇన్‌స్టా అకౌంట్‌లో ఫాలోవర్స్ సంఖ్య 21.8 మిలియన్స్‌కి చేరుకోవడం విశేషం.

ఇక ఇన్‌స్టాకు అనుబంధంగా థ్రెడ్స్ యాప్‌ను తీసుకొచ్చారు. ఇక్కడ కూడా బన్నీ సత్తా చాటుతున్నాడు. తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నారు. థ్రెడ్స్ యాప్‌లో ఇండియాలోనే వన్ మిలియన్స్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న తొలి నటుడిగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. బన్నీ రేంజ్‌కి ఇంతకు మించిన నిదర్శనం ఇంకేముంటుంది? ముఖ్యంగా పుష్ప మూవీతో బన్నీ పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు.

అల్లు అర్జున్.. ఇండియాలో ఆ ఘనతను సాధించిన తొలి హీరో!

పుష్ప ఇచ్చిన క్రేజ్‌తోనే థ్రెడ్స్‌లో అంత త్వరగా వన్ మిలియన్ ఫాలోవర్స్‌ని బన్నీ సాధించాడు. ఫ్లాట్ ఫామ్ ఏదైనా సరే బన్నీ మాత్రం తిరుగులేని సత్తా చాటుతున్నాడు.

ఇక కెరీర్ విషయానికి వస్తే.. అందరు హీరోల మాదిరిగానే బన్నీ కూడా పాన్ ఇండియా పైనే ఫోకస్ పెడుతున్నాడు. పుష్ప 2 అవగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో మరో పాన్ ఇండియా మూవీకి సిద్ధమవుతున్నాడు. ఆ తరువాత అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగాతో మరో పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు.

Google News