నడవలేని స్థితిలో హాస్పిటల్ బెడ్‌పై యాదమ రాజు.. అతనికి ఏమైందంటే..

నడవలేని స్థితిలో హాస్పిటల్ బెడ్‌పై యాదమ రాజు.. అతనికి ఏమైందంటే..

కమెడియన్ యాదమ రాజు తెలియని వారు ఎవరుంటారు. పటాస్ షో ద్వారా తెగ ఫేమస్ అయిపోయాడు. ఈ షో చూడటానికి వచ్చి ఆపై కంటెస్టెంట్‌గా మారి ఆ తరువాత చాలా కామెడీ షోలలో తన సత్తా చాటాడు. ప్రస్తుతం యాదమ రాజు ఆసుపత్రి బెడ్‌పై నడవలేని స్థితిలో ఉన్నాడు. యాదమ రాజుకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ ఛానల్ ద్వారా నిత్యం ఏదో ఒక వీడియోను పోస్ట్ చేస్తూనే ఉంటాడు.

నడవలేని స్థితిలో హాస్పిటల్ బెడ్‌పై యాదమ రాజు.. అతనికి ఏమైందంటే..

తాజాగా యాదమ రాజు భార్య ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో యాదమ రాజు నడవలేని స్థితిలో హాస్పిటల్ బెడ్‌పై కనిపించాడు. అతని కాలికి తీవ్ర గాయమైనట్టుగా కనిపిస్తోంది. అది చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. నిన్న మొన్నటి వరకూ చాలా యాక్టివ్‌గా వీడియోలు చేసిన యాదమ రాజుకి హఠాత్తుగా ఏమైందంటూ ఆయన భార్య స్టెల్లాపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై స్టెల్లా వివరణ ఇచ్చింది. 

యాదమ రాజు చిన్నపాటి ప్రమాదానికి గురయ్యాడని స్టెల్లా తెలిపింది. ఆయన త్వరలో కోలుకుంటారని… మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలని పేర్కొంది. అలాగే యాదమ రాజు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. అలాగే తన భర్త యాదమ రాజును ఉద్దేశిస్తూ.. ‘నేను నీ పక్కన ఉండగా నీకేం కాదు’ అని చెప్పి స్టెల్లా భరోసా ఇచ్చింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. యాదమ రాజు త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇవీ చదవండి:

అల్లు అర్జున్.. ఇండియాలో ఆ ఘనతను సాధించిన తొలి హీరో!

యాంకర్ ప్రదీప్‌కి కాబోయే భార్య ఆమేనట.. ఫోటో లీక్ చేసిన సీరియల్ నటి!

అమెరికాలోని ఓ మ్యూజిక్ షోలో స్పెషల్ అట్రాక్షన్‌గా అనసూయ

బిగ్‌బాస్ తెలుగుకి కంటెస్టెంట్స్ కరువు!

అమ్మకు బాగోలేదని.. ఆ డబ్బుతో కారు కొన్నావా? ముక్కు అవినాష్‌పై నెటిజన్లు ఫైర్

‘గుంటూరు కారం’ సినిమా నుంచి తమన్ ఔట్?

Google News