పోటీగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్‌ని నాశనం చేశారంటూ దిల్ రాజుపై సి.కల్యాణ్ ఫైర్

పోటీగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్‌ని నాశనం చేశారంటూ దిల్ రాజుపై సి.కల్యాణ్ ఫైర్

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 30న ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో దిల్ రాజు ప్యానెల్, సి. కళ్యాణ్ ప్యానెల్‌లు ఉన్నాయి. ఇరు ప్యానెళ్లు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఒక ప్యానెల్‌పై మరో ప్యానెల్ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. తాజాగా దిల్ రాజుపై సి. కల్యాణ్ ఫైర్ అయ్యారు. దిల్ రాజు ఎన్నికల ప్రచారంలో నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

ఓటర్లు విచక్షణతో, అండగా ఉండేవాళ్లను గెలిపించాలని సి.కల్యాణ్ కోరుకున్నారు. 70-30 రేషియోలో అభ్యర్థులను నిలిపి తామేదో ఫిల్మ్ కౌన్సిల్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచామని ప్రచారం చేసుకుంటున్నారని దిల్ రాజుపై కల్యాణ్ మండిపడ్డారు. పోనీ గెలిచి చేసిందేమైనా ఉందా? అంటే ఏమీ లేదన్నారు. ఇప్పుడు గెలిచి మాత్రం ఏం చేస్తారని నిలదీశారు. చిన్న నిర్మాతలకు, చిన్న చిత్రాలకు దిల్ రాజు మేలు చేయరని సి. కల్యాణ్ తేల్చారు.

దిల్ రాజు ఏం చేసినా తమ వ్యాపారం కోసమే చేస్తారన్నారు. ఇప్పటి వూకు ఎంత మంది నిర్మాతల సమస్యలు తీర్చారో చెప్పాలని సి.కల్యాణ్ నిలదీశారు. షూటింగ్స్ కి బంద్ ప్రకటించి సమస్యలు చర్చిద్దాం అన్నారని.. విజయ్‌తో తాను చేసేది తమిళ సినిమా అని షూటింగ్ చేసుకున్నారని ఆరోపించారు. 20 మంది పెద్ద నిర్మాతలతో పరిశ్రమ నడవదన్నారు. తనకు పోటీగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్‌ని దిల్ రాజు నాశనం చేశారని.. ఆయన కారణంగా ఎంత మంది సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ ఆత్మహత్య చేసుకున్నారో చెప్పాలని సి.కల్యాణ్ నిలదీశారు.

ఇవీ చదవండి:

నడవలేని స్థితిలో హాస్పిటల్ బెడ్‌పై యాదమ రాజు.. అతనికి ఏమైందంటే..

అల్లు అర్జున్.. ఇండియాలో ఆ ఘనతను సాధించిన తొలి హీరో!

యాంకర్ ప్రదీప్‌కి కాబోయే భార్య ఆమేనట.. ఫోటో లీక్ చేసిన సీరియల్ నటి!

అమెరికాలోని ఓ మ్యూజిక్ షోలో స్పెషల్ అట్రాక్షన్‌గా అనసూయ

బిగ్‌బాస్ తెలుగుకి కంటెస్టెంట్స్ కరువు!

అమ్మకు బాగోలేదని.. ఆ డబ్బుతో కారు కొన్నావా? ముక్కు అవినాష్‌పై నెటిజన్లు ఫైర్

Google News