అందం కోసం హనీరోజ్ సర్జరీలు చేయించుకుందట..

అందం కోసం హనీరోజ్ సర్జరీలు చేయించుకుందట..

హనీరోజ్.. ఇప్పుడీ ముద్దుగుమ్మ తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ ముద్దుగుమ్మ 2008లోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా కూడా ఎవరికీ పెద్దగా తెలియదు. అప్పటి నుంచి ఏదో ఒక సినిమాలు చేస్తూనే ఉంది కానీ అంత గుర్తింపు అయితే రాలేదు. కానీ వీరసింహారెడ్డి మూవీలో బాలయ్య భార్యగా, తల్లిగా చేసిన తర్వాత మాత్రం హనీరోజ్‌కి కావల్సినంత నేమ్, ఫేమ్ వచ్చింది. 

సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు… ఒకరకంగా హనీ రోజ్‌కి అదిరిపోయే టర్న్ ఇచ్చిన మూవీగా నిలిచిపోయింది. బాలయ్య వంటి లెజెండ్ పక్కన నటించే ఛాన్స్ రావడం అదృష్టం అని ఇప్పటికే హనీ రోజ్ ఓ సందర్భంలో తెలిపింది. ఇక ప్రస్తుతం హనీ రోజ్ రాచల్ టైటిల్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది.

Advertisement
అందం కోసం హనీరోజ్ సర్జరీలు చేయించుకుందట..

అయితే హనీ రోజ్ గురించి ఒక పుకారు తెగ షికారు చేస్తోంది. అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం హనీ బేబీ సర్జరీలు చేయించుకుందట. ఈ పుకారు అమ్మడి వరకూ వెళ్లింది. దీనిపై అమ్మడు స్పందిస్తూ.. తాను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని.. తనది సహజ అందమేనని తేల్చి చెప్పింది. తాను సర్జరీల జోలికి వెళ్లలేదని తెలిపింది. ఇప్పటికే అమ్మడు తాను సోషల్ మీడియా కామెంట్స్, ట్రోల్స్‌ను కేర్ చేయనని చెప్పేసింది. కాబట్టి హనీరోజ్ ఈ రూమర్‌ను కూడా లైట్ తీసుకున్నట్టే..

ఇవీ చదవండి:

విజయ్ దేవరకొండ షర్ట్ వేసుకుని మరోసారి దొరికిపోయిన రష్మిక మందన్నా

తమన్నా పై ఫైర్ అయిన అల్లు అర్జున్ భార్య

సాయి ధరమ్‌కి పవన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పోటీగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్‌ని నాశనం చేశారంటూ దిల్ రాజుపై సి.కల్యాణ్ ఫైర్

నడవలేని స్థితిలో హాస్పిటల్ బెడ్‌పై యాదమ రాజు.. అతనికి ఏమైందంటే..

అల్లు అర్జున్.. ఇండియాలో ఆ ఘనతను సాధించిన తొలి హీరో!