ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ హీరోయిన్ ట్వీట్.. దీనిపై రచ్చ రచ్చ..

ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ హీరోయిన్ ట్వీట్.. దీనిపై రచ్చ రచ్చ..

హీరోయిన్ ఊర్వశి రౌతాలా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆమె ట్వీట్ ఒకరికి మోదం.. మరొకరికి ఖేదం అన్నట్టుగా మారింది. ఊర్వశి ట్వీట్ వచ్చేసి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపగా.. ఆయన యాంటీ వర్గానికి మాత్రం విపరీతమైన ఆగ్రహం తెప్పించింది. దీంతో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఊర్వశి రౌతాలా ఏం ట్వీట్ చేశారో చూద్దాం.

పవన్ కళ్యాణ్ సీఎం పీఠం అధిరోహిస్తే చూడాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారని.. జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారని ఊర్వశి తన ట్వీట్‌లో పేర్కొంది. పవన్ నిర్వహిస్తున్న సభల్లో సీఎం నినాదాలు వినిపిస్తున్న విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రితో నటించడం గొప్ప అనుభూతి అని తెలిపింది.పవన్‌ను ఏకంగా ఏపీ సీఎంగా ఊర్వశి నిర్ధారించడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

Advertisement
ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ హీరోయిన్ ట్వీట్.. దీనిపై రచ్చ రచ్చ..

ఏపీ సీఎం పవన్ కల్యాణ్ అన్నట్టుగా ఊర్వశి ట్వీట్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఆయన వ్యతిరేక వర్గం మాత్రం ట్రోల్ చేస్తోంది. మెగా హీరోల మెప్పు కోసం పవన్ ఇలాంటి ట్వీట్ చేశారని విమర్శిస్తున్నారు. అయితే ఊర్వశి రౌతాలా గత ఏడాది తమిళ్ మూవీ లెజెండ్‌లో హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్ర హీరో అరుళ్ శరవణన్ ని ఉద్దేశిస్తూ ఇదే తరహా కామెంట్ చేశారు. కాబట్టి ఏ హీరోతో చేసినా ఆమె ఇలాంటి కామెంట్స్ చేయడం సహజమని ఎద్దేవా చేస్తున్నారు.

ఇవీ చదవండి:

జగన్, అంబటి రాంబాబులకు ‘బ్రో’లో దిమ్మతిరిగే డైలాగ్స్.. వైరల్ చేస్తున్న ఫ్యాన్స్

గుంటూరు కారం సినిమా నిర్మాతలకు చుక్కలేనట..

BRO Twitter Review: ‘బ్రో’ ట్విటర్ రివ్యూ: ఆ సన్నివేశాలు హైలైట్

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 7పై కేసు.. దీనిలో నిజమెంత?

అందం కోసం హనీరోజ్ సర్జరీలు చేయించుకుందట..

విజయ్ దేవరకొండ షర్ట్ వేసుకుని మరోసారి దొరికిపోయిన రష్మిక మందన్నా