జగన్, అంబటి రాంబాబులకు ‘బ్రో’లో దిమ్మతిరిగే డైలాగ్స్.. వైరల్ చేస్తున్న ఫ్యాన్స్

జగన్, అంబటి రాంబాబులకు ‘బ్రో’లో దిమ్మతిరిగే డైలాగ్స్.. వైరల్ చేస్తున్న ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అన్ని థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే పవన్ ఇటీవలి కాలంలో తన ప్రతీ సినిమాలకు పొలిటికల్ డైలాగ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. జనసేన ఇమేజ్ పెంచే విధంగా.. అలాగే అధికార పక్షానికి చురకలు అంటించేలా డైలాగ్స్ రాయించుకున్నారు. భీమ్లా నాయక్ సినిమాలోనూ పవన్ అధికార పార్టీని విమర్శించిన తీరు ఆ పార్టీ నాయకులకు మింగుడు పడలేదు. 

ఇక తన లేటెస్ట్ మూవీ బ్రో ద్వారా కూడా ఏపీ సీఎం జగన్ కి పవన్ చురకలు వేశాడని టాక్. బ్రో ప్రీమియర్స్ చూసిన ఫ్యాన్స్ ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో పవన్ పొలిటికల్ డైలాగ్స్‌ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అద్భుతంగా రాసిన పొలిటికల్ రిలేటెడ్ డైలాగ్స్‌కు పవన్ ప్రాణం పోశారంటున్నారు. ఈ డైలాగ్స్ ఓ రేంజ్‌లో పేలాయంటూ పవన్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. 

పవన్ నోటి నుండి ఓ రేంజ్ లో పేలాయట. మంత్రి అంబటి రాంబాబుకి సైతం అదిరిపోయేలా కౌంటర్లు ఇచ్చారట. వీటిని థియేటర్స్‌లో చూసి జనసైనికులు బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారట. ఇక జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు మీద త్రివిక్రమ్ రాసిన ఓ డైలాగ్ అద్భుతం అంటున్నారు. గాజు గ్లాసు కాదు భూత వర్తమాన భవిష్యత్ కాలాలను మార్చే ఆయుధం అంటూ పవన్ చెప్పిన డైలాగ్‌ను ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

గుంటూరు కారం సినిమా నిర్మాతలకు చుక్కలేనట..

BRO Twitter Review: ‘బ్రో’ ట్విటర్ రివ్యూ: ఆ సన్నివేశాలు హైలైట్

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 7పై కేసు.. దీనిలో నిజమెంత?

అందం కోసం హనీరోజ్ సర్జరీలు చేయించుకుందట..

విజయ్ దేవరకొండ షర్ట్ వేసుకుని మరోసారి దొరికిపోయిన రష్మిక మందన్నా

తమన్నా పై ఫైర్ అయిన అల్లు అర్జున్ భార్య

Google News