‘బిగ్‌బాస్ 6’ తెలుగు ఫేం కీర్తి నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే..

‘బిగ్‌బాస్ 6’ తెలుగు ఫేం కీర్తి నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే..

బిగ్‌బాస్‌ బ్యూటీ, నటి కీర్తి భట్‌ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతోంది. ఈ ముద్దుగుమ్మ కొంతకాలంగా హీరో విజయ కార్తీక్‌‌తో ప్రేమలో ఉంది. వీరి ప్రేమకు కార్తీక్ కుటుంబం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. ఇటీవలే ఈ జంట ఓ షోలో దండలు మార్చుకుంది. ఇక రియల్ లైఫ్‌లోనూ కీర్తి-కార్తీక్‌ల నిశ్చితార్థానికి పెద్దలు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. 

మరో వైపు పెళ్లి పనులను కూడా ప్రారంభించేశారు. ఇక తమ ఎంగేజ్‌మెంట్‌కు రావాలంటూ ఇద్దరూ తమ తోటి నటులతో పాటు బంధుమిత్రులను ఆహ్వాన పత్రికిలు పంచుతున్నారు. ఈ క్రమంలో జానకి కలగనలేదు సీరియల్‌ నటి ప్రియాంక జైన్‌, నటుడు అమర్‌ దీప్‌ దగ్గరకు వెళ్లి కార్డులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

ఇక సీరియల్ నటి ప్రియాంక సైతం తన యూట్యూబ్‌ ఛానల్‌లో కీర్తి పెళ్లి విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. జానకి కలగనలేదు సీరియల్‌ సెట్‌లోకి వెళ్లిన కీర్తి, కార్తీక్‌ అక్కడున్న అందరికీ ఆహ్వానపత్రికలు పంచారు. ఆగస్ట్ 20న తమ నిశ్చితార్థమని చెప్పారు. బేగంపేట్‌లో జరగబోతోందని తెలిపారు. మొత్తానికి కీర్తి నిశ్చితార్థం సందర్భంగా ఫ్యాన్స్ ఆ జంటకు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇవీ చదవండి:

ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్‌లో రెండు వీడియోలు.. షాక్‌లో ఫ్యాన్స్

ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ హీరోయిన్ ట్వీట్.. దీనిపై రచ్చ రచ్చ..

జగన్, అంబటి రాంబాబులకు ‘బ్రో’లో దిమ్మతిరిగే డైలాగ్స్.. వైరల్ చేస్తున్న ఫ్యాన్స్

గుంటూరు కారం సినిమా నిర్మాతలకు చుక్కలేనట..

BRO Twitter Review: ‘బ్రో’ ట్విటర్ రివ్యూ: ఆ సన్నివేశాలు హైలైట్

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 7పై కేసు.. దీనిలో నిజమెంత?

Google News