బాలి ద్వీపంలో తెగ ఎంజాయ్ చేస్తున్న సమంత

బాలి ద్వీపంలో తెగ ఎంజాయ్ చేస్తున్న సమంత

సమంత.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు పెద్దగా సమయం పట్టలేదు. ఖుషీ సినిమాతో పాటు సిటాడెల్ షూటింగ్ పూర్తి చేసి సినిమాలకు విరామం ఇచ్చేసింది. ప్రస్తుతం ఆమె విదేశాల్లో విహరిస్తోంది. ఆమె ముందుగా.. తన అనారోగ్యానికి చికిత్స నిమిత్తం విదేశాలకు వెళుతోందని టాక్ నడిచింది. కానీ ఆ తరువాత మాత్రం సేదతీరేందుకు వెళ్లిందని టాక్. ప్రస్తుతం సామ్ సేదతీరేందుకు ఇండోనేషియా దేశాన్ని ఎంచుకుందట.

ప్రస్తుతం సామ్ బాలి ద్వీపంలో తెగ ఎంజాయ్ చేస్తోందట. అసలే అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో సామ్ మరింత హాయిగా విహరిస్తోందట. అంతేకాదు.. అక్కడ తన ఎంజాయ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చే స్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక వీడియో కూడా షేర్ చేసింది.

బాలి ద్వీపంలో తెగ ఎంజాయ్ చేస్తున్న సమంత

ఇక సామ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. డెనిమ్ షార్ట్స్‌లో అమ్మడి లుక్ మామూలుగా లేదు. ఇక సామ్ డ్యాన్స్ చేసిన తీరు చూపరులను కట్టిపడేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సమంత సమంత విదేశాల్లో చేస్తుంది ఇదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సామ్ అక్కడికి తన స్నేహితులతో కలిసి వెళ్లనుందట. మరికొన్ని రోజులు అక్కడ ఉండి ఆ తరువాత సామ్ అమెరికా వెళతారనే ప్రచారం జరుగుతోంది.

ఇవీ చదవండి:

‘బిగ్‌బాస్ 6’ తెలుగు ఫేం కీర్తి నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే..

ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్‌లో రెండు వీడియోలు.. షాక్‌లో ఫ్యాన్స్

ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ హీరోయిన్ ట్వీట్.. దీనిపై రచ్చ రచ్చ..

జగన్, అంబటి రాంబాబులకు ‘బ్రో’లో దిమ్మతిరిగే డైలాగ్స్.. వైరల్ చేస్తున్న ఫ్యాన్స్

గుంటూరు కారం సినిమా నిర్మాతలకు చుక్కలేనట..

Google News