చాలా కాలం తర్వాత బుల్లితెరపై దర్శనమిచ్చిన చలాకీ చంటి.. ఎలా ఉన్నాడంటే..

చాలా కాలం తర్వాత బుల్లితెరపై దర్శనమిచ్చిన చలాకీ చంటి.. ఎలా ఉన్నాడంటే..

చలాకీ చంటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమెడియన్‌గా వెండి తెరపై ఆయన ప్రస్థానం ప్రారంభమైనప్పటికీ బుల్లితెరే లైఫ్ ఇచ్చింది. భీమిలి కబడ్డీ జట్టు వంటి మూవీస్‌తో వెండితెరపై తన అదృష్టాన్ిన పరీక్షించుకునేందుకు యత్నించాడు కానీ విఫలమయ్యాడు. ఇక ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఇక అంతే.. చంటికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

చలాకీ చంటిగా జనం గుండెల్లో స్థిరపడిపోయాడు. తన మార్క్ కామెడీతో చంటి బుల్లితెరపై ఓ వెలుగు వెలిగాడు. మరోవైపు యాంకర్‌గా కూడా రాణించాడు. ఒకటి రెండు షోలు చేశాడు. అడపాదడపా చిత్రాల్లో నటిస్తూనే ఉన్నాడు. ఆ తరువాత బిగ్‌బాస్ సీజన్ 6లో అడుగు పెట్టాడు కానీ అక్కడ మాత్రం ఎందుకో అస్సలు రాణించలేకపోయాడు. మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయి ఇంటి దారి పట్టాడు.

Advertisement

ఇక ఇటీవలి కాలంలో చలాకీ చంటి అనారోగ్యం పాలవడంతో బుల్లితెరకు చాలా కాలం పాటు దూరమయ్యాడు. తాజాగా రెండు షోలలో చంటి కనిపించాడు. సుమ అడ్డా షోతో పాటు.. తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. చూస్తుంటే చంటి అయితే బాగానే కోలుకున్నట్టు కనిపిస్తున్నాడు కానీ అనారోగ్యం కారణంగా బాగా బలహీనంగా కనిపించాడు. చాలా సన్నగా అయిపోయాడు. కానీ తన మార్క్ పంచ్‌లతో ఆకట్టుకున్నాడు.

ఇవీ చదవండి:

బాలి ద్వీపంలో తెగ ఎంజాయ్ చేస్తున్న సమంత

‘బిగ్‌బాస్ 6’ తెలుగు ఫేం కీర్తి నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే..

ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్‌లో రెండు వీడియోలు.. షాక్‌లో ఫ్యాన్స్

ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ హీరోయిన్ ట్వీట్.. దీనిపై రచ్చ రచ్చ..

జగన్, అంబటి రాంబాబులకు ‘బ్రో’లో దిమ్మతిరిగే డైలాగ్స్.. వైరల్ చేస్తున్న ఫ్యాన్స్

గుంటూరు కారం సినిమా నిర్మాతలకు చుక్కలేనట..