సినీ నటి శోభన ఇంట్లో దొంగతనం..

సినీ నటి శోభన ఇంట్లో దొంగతనం..

ప్రముఖ సీనియర్ నటి, భరత నాట్యం కళాకారిణి శోభన ఇంట్లో చోరీ జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం శోభన చెన్నైలోని తేనాంపేట, శ్రీమాన్‌ శ్రీనివాస కాలనీలో తల్లితో కలిసి నివాసముంటోంది. అయితే ఈ కాలనీలో ఆమెకు రెండస్తుల భవనం ఉంది. పై భాగంలో శోభన కుటుంబం నివసిస్తుండగా.. కింది భాగంలో డ్యాన్స్‌ స్కూల్ నిర్వహిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు వృద్ధులయిపోవడంతో శోభన వారి సంరక్షణ కోసం ఓ మహిళను నియమించారు.

కడలూరు జిల్లా, కొట్టుమన్నార్‌ కోవిల్‌కు చెందిన విజయ అనే మహిళ గత కొద్ది రోజులుగా శోభన తల్లిదండ్రులకు సంబంధించిన పనులన్నింటినీ చూస్తోంది. అయితే తన ఇంట్లో కొద్ది రోజులుగా డబ్బు చోరీకి గురవుతుండటాన్ని గమనించి.. తమ ఇంటికి వేరొకరు ఎవరూ వచ్చే అవకాశం లేకపోవడంతో ఇది పని పని మనిషి పనేనని గుర్తించారు. వెంటనే విజయను పిలిచి ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని బుకాయించింది. దీంతో శోభన స్థానిక తేనాంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement
సినీ నటి శోభన ఇంట్లో దొంగతనం..

పోలీసులు పనిమనిషి విజయను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. గత మార్చి నెల నుంచి ఇప్పటి వరకూ రూ.41 వేల వరకు దొంగలించినట్లు అంగీకరించింది. ఇక ఆ డబ్బును తన కారు డ్రైవర్‌ మురుగన్‌ సాయంతో గూగుల్ పే ద్వారా కూతురికి పంపించిందట.

పేదరికం కారణంగానే దొంగతనం చేశానని.. తనను పనిలో నుంచి తొలగించవద్దని శోభనను వేడుకోవడంతో ఆమె విజయ జీతం నుంచి రూ.41 వేలు కట్ చేస్తానని తెలిపి.. మరోసారి ఇలా చేయవద్దని మెచ్చరించి పనిలో కొనసాగిస్తున్నారు.

ఇవీ చదవండి:

బాలి ద్వీపంలో తెగ ఎంజాయ్ చేస్తున్న సమంత

‘బిగ్‌బాస్ 6’ తెలుగు ఫేం కీర్తి నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే..

ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్‌లో రెండు వీడియోలు.. షాక్‌లో ఫ్యాన్స్

ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ హీరోయిన్ ట్వీట్.. దీనిపై రచ్చ రచ్చ..

జగన్, అంబటి రాంబాబులకు ‘బ్రో’లో దిమ్మతిరిగే డైలాగ్స్.. వైరల్ చేస్తున్న ఫ్యాన్స్

గుంటూరు కారం సినిమా నిర్మాతలకు చుక్కలేనట..