తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు విజయం ఎలా సాధ్యమైందంటే..

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు విజయం ఎలా సాధ్యమైందంటే..

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా సాధారణ ఎన్నికలను తలపిస్తుంటాయి. ఈసారి సి. కళ్యాణ్, దిల్ రాజు ప్యానెల్స్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన ఈ ఎన్నికల్లో దిల్ రాజుదే పై చేయిగా నిలిచింది. నిన్న ఫిలిం చాంబర్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా? అనే దానిపై నిన్న ఉదయం నుంచే ఆసక్తి నెలకొంది.

ఫైనల్‌గా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు ఎన్నికయ్యారు. దిల్ రాజు ఎన్నిక అంత ఆషామాషీగా ఏమీ జరగలేదు. సి. కల్యాణ్ కూడా గట్టి పోటీయే ఇచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా పెద్ద ఎత్తున ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. కానీ అంతమ విజయం దిల్ రాజునే వరించింది. దిల్ రాజు విజయానికి చాలా కారణాలే ఉన్నాయి. బడా నిర్మాత కావడంతో ఆయనకు పరిచయాలు బీభత్సంగానే ఉన్నాయి.

పైగా నైజాం మొత్తం దిల్ రాజు చేతుల్లో ఉంది. అది చాలదన్నట్టుగా మెగా సపోర్ట్ కూడా ఉండటం దిల్ రాజుకు బాగా కలిసొచ్చింది. ఇక సి. కల్యాణ్‌కు పరిచయాలు లేవని కాదు కానీ ఒకప్పుడు సౌత్ ఇండియాను ఏలేశారు. సౌత్ ఇండియాలో ఆయన చేపట్టని పదవి అంటూ లేదు కానీ ఏం ప్రయోజనం? చేసేది మాత్రం ఏమీ ఉండదు. గత ఎన్నికల్లో మంచు విష్ణు సైతం ఏదో చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకుని విజయం సాధించాడు. కానీ చేసేందేమీ లేదు శూన్యం. అందుకే.. వీళ్ల సత్తా ఏంటో తెలిసిపోతోంది కాబట్టి గతంలో గెలిచిన వారెవరికీ దాదాపు మరో ఛాన్స్ రావడం కష్టమే.

ఇవీ చదవండి:

75 ఏళ్ల వృద్ధుడికి వలవేసిన సీరియల్ నటి.. బట్టలన్నీ విప్పించి.. ఫోటోలు తీయించి.. ఆపై..

సినీ నటి శోభన ఇంట్లో దొంగతనం..

బాలి ద్వీపంలో తెగ ఎంజాయ్ చేస్తున్న సమంత

‘బిగ్‌బాస్ 6’ తెలుగు ఫేం కీర్తి నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే..

ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్‌లో రెండు వీడియోలు.. షాక్‌లో ఫ్యాన్స్

ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ హీరోయిన్ ట్వీట్.. దీనిపై రచ్చ రచ్చ..